Aranmanai 4 : అయ్యో పాపం!! ఆ సాంగ్​ షూటింగ్​లో తెగ కష్టపడుతున్న రాశీ, తమన్నా

- Advertisement -

Aranmanai 4 .. తమిళ్​లో ఈ సినిమా ఫ్రాంఛైజీలో ఇప్పటికే మూడు సినిమాలు విడుదలయ్యాయి. చంద్రకళ, కళావతి, అంతపురం పేర్లతో ఈ చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. తమిళ్ డైరెక్టర్ సుందర్.సి తెరకెక్కించిన ఈ ఫ్రాంఛైజీలో మరో సినిమా రాబోతోంది. అరణ్ మనై4 చిత్రం పట్టాలెక్కుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా, తమన్నా భాటియా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలో అచ్చచ్చో అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటలో తమన్నా, రాశీ కలిసి స్టెప్పులు వేస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్​కు సంబంధించి రాశీ ఖన్నా బీటీఎస్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

Aranmanai 4
Aranmanai 4

ఆ వీడియో కింద చాలా సుదీర్ఘమైన క్యాప్షన్ రాసుకొచ్చింది రాశీ. అచ్చచ్చో పాట బీటీఎస్ వీడియో ఇది. ఈ పాట ఇటీవలే విడుదలైంది. అందుకే బిహైండ్ ది సీన్స్ వీడియోను షేర్ చేశారు. ఈ పాటకు డ్యాన్స్ చేసేందుకు నేను, ట్యామ్ (తమన్నా) చాలా కష్టపడ్డాం. సాంగ్ షూటింగ్ పూర్తయ్యే వరకు మా స్టామినా తగ్గొద్దని చాలా ప్రార్థించాం. కానీ ఈ సాంగ్ లో బీట్స్​ మాత్రం అద్దిరిపోయాయి. ఆ బీట్స్​లో ఉన్న ఊపు మా డ్యాన్స్​లో జోరుతో మ్యాచ్ అయిపోయింది. ఈ పాట షూటింగ్ సమయంలో మేం కళ్లు తిరిగి పడిపోకుండా సాయం చేసిన టీమ్​కు కృతజ్ఞతలు. ఈ సాంగ్ కంపోజ్ చేసిన బృందా గోపాల్​కు స్పెషల్ థాంక్స్. ఈ వీడియో చూసి ఆనందించండి అంటూ రాశీ క్యాప్షన్​లో రాసుకొచ్చింది.

- Advertisement -

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అది కూడా ఒకే పాటకు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడంతో థ్రిల్ అవుతున్నారు. గతంలో కూడా ఈ ఇద్దరూ కలిసి రవితేజతో బెంగాల్ టైగర్​లో నటించిన విషయం తెలిసిందే. అందులోనూ ఓ పాటకు ఈ ఇద్దరు భామలు కలిసి స్టెప్పులేశారు.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here