లైవ్ షోలో అల్లరి నరేష్ కి ఫోన్ చేసి బూతులు తిట్టిన ఆర్. నారాయణ మూర్తి!

- Advertisement -

అల్లరి నరేష్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో కామెడీ జానర్ సినిమా తీసి సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నవ్వు రప్పించడం సాధారణమైన విషయం కాదు. నవరసాల్లో హాస్యరసం అనేది చాలా క్లిష్టమైనది, హాస్యాన్ని పండించే నటుడు ఎలాంటి పాత్రని అయినా పోషించగలడు అని పెద్దలు అంటూ ఉంటారు. ఎదో ఒక సన్నివేశంలో కామెడీ రప్పించడమే చాలా కష్టం , అలాంటిది సినిమా మొత్తం నవ్వు రప్పించడం అంటే సాధారమైన విషయం కాదు.

అల్లరి నరేష్
అల్లరి నరేష్

టాలీవుడ్ లో మాస్ హీరోలు ఉన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ హీరోలు ఉన్నారు, యూత్ ఫుల్ హీరోలు కూడా ఉన్నారు. కానీ కామెడీ హీరోలు మాత్రం ప్రతీ జెనెరేషన్ కి కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ అయితే, నేటి తరం లో మంచి కామెడీ హీరో గా పేరు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్, అద్భుతమైన కామెడీ ని పండించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

అయితే అల్లరి నరేష్ కామెడీ ప్రారంభం లో చాలా అద్భుతంగా ఉండేది, కానీ మధ్యలో స్పూఫ్స్ చేసి తనని తాను బాగా తగ్గించేసుకున్నాడు. పక్క హీరోల హైలైట్ సన్నివేశాలను స్పూఫ్ చేస్తూ అల్లరి నరేష్ ఇది వరకు ఎన్నో సినిమాలు చేసాడు. ఇది చూసి చూసి జనాలకు బాగా విరక్తి కలిగేసింది. ఒకానొక దశలో అల్లరి నరేష్ సినిమాలకు జనాలు థియేటర్స్ కి రావడం బాగా తగ్గించేశారు. ఆయన మార్కెట్ కూడా బాగా డౌన్ అయిపోయింది. ఇది గమనించిన అల్లరి నరేష్ ‘మహర్షి’ సినిమా నుండి తన రూట్ ని మార్చాడు.

- Advertisement -

కామెడీ జానర్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వచ్చాడు. ఫలితంగా ఆయనకీ సూపర్ హిట్స్ కూడా దక్కాయి. అయితే ఒకానొక సందర్భం లో ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి ఫోన్ చేసి, అల్లరి నరేష్ గారు , మీరు చాలా మంచి నటులు, కానీ ఆ స్పూఫ్ సినిమాలు చెయ్యడం ఆపేయండి సార్, చాలా చిరాకు పుడుతుంది అంటూ కామెంట్ చేస్తాడు. అప్పటి నుండే అల్లరి నరేష్ లో ఈ మార్పు వచ్చిందని అంటుంటారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here