Samantha : సమంతకు ఎసరు పెట్టిన శ్రీలీల.. అందరి హీరోయిన్లను నాశనం చేస్తుందిగా..

- Advertisement -

Samantha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. గతేడాది నుంచి ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే. బన్నీ, రష్మిక నటన అంతా ఒక ఎత్తు అయితే.. సమంత ఐటెంసాంగ్ మరో ఎత్తు అని చెప్పొచ్చు.

Samantha
Samantha

ఊ అంటావా.. మావా.. అంటూ ఇండస్ట్రీని షేక్ చేసింది సమంత. ఇక ఈసారి పుష్ప 2 తో కూడా అంతకు మించి చేయాలనీ చూస్తున్నాడట. ఇందుకోసం సుకుమార్ బాగా కష్టపడుతున్నాడని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా సామ్ లా ఐటెంసాంగ్ చేసే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెల్సిందే. ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఊర్వశీ రౌతేలాను ఫిక్స్ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని సమాచారం. ఇక తాజాగా ఈ ఐటంసాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకున్నారని టాక్ నడుస్తోంది.

ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ బిజీయెస్ట్ హీరోయిన్ శ్రీలీల. అవును.. మీరు విన్నది నిజమే. అమ్మడి డ్యాన్స్ కు ఫిదా అయిన సుకుమార్ .. బన్నీతో ఈ చిన్నది కలిస్తే మరింత హైప్ వస్తుంది అని భావించి శ్రీలీలను సంప్రదించారట. అయితే శ్రీలీల మాత్రం.. బన్నీతో ఒక్క సాంగ్ చేస్తే.. ఫుల్ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వస్తుందో.. రాదో అని ఆలోచిస్తుందట. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఇది మాత్రం నిజం కాదు అని శ్రీలీల అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఆమె.. ఒక ఐటెంసాంగ్ చేస్తుందా.. ? ఇదంతా ఫేక్ అని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here