Pushpa 2 : పుష్ప2 రిలీజ్ కు ముందే రికార్డు.. అల్లు అర్జున్ తర్వాతేనా ఇక ఏ హీరోనైనా..!

- Advertisement -

Pushpa 2 : 2021లో పుష్ప 1: ది రైజ్ మూవీతో దేశవ్యాప్తంగా బంపర్ హిట్ కొట్టారు అల్లు అర్జున్. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు. ఈ చిత్రానికి సీక్వెల్‍గా ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’ రూపొందుతోంది. దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ కంటే ఈ సీక్వెల్‍ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. 2024 ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా అప్‍డేట్ల కోసం ఐకాన్ స్టార్ ఫ్యాన్ ఎదురుచూస్తునే ఉన్నారు. ఈ క్రమంలో పుష్ప 2: ది రూల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల ఒప్పందం పూర్తయిందనే సమాచారం బయటికి వచ్చింది.

Pushpa 2 :
Pushpa 2 :

పుష్ప 2: ది రూల్ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ తాజాగా జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కైవసం చేసుకున్నట్టు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక తమ ప్లాట్‍ఫామ్‍లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేసుకునేందుకు నెట్‍ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకుందని వెల్లడైంది. రికార్డు ధరకు పుష్ప 2 డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాట. పుష్ప 2: ది రూల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ మూవీలో ఉండనున్నాయి.

pushpa 2
pushpa 2

గంధపు చెక్కల స్మగ్లింగ్ సిండికేట్‍కు లీడర్ అయ్యాక పుష్ప (అల్లు అర్జున్) రూల్ చేయడం ఈ మూవీలో ఉండనుంది. పుష్ప 2 సినిమా కోసం టాలీవుడ్‍తో పాటు బాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది. మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ఈ సినిమా ఉంది. పుష్ప 1 సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్, మేనరిజమ్స్, లుక్ ఫుల్ ఫేమస్ అయ్యాయి. దేశమంతా ఈ మూవీ పేరు మార్మోగింది. చాలా మంది సెలెబ్రిటీలు, క్రికెటర్లు అల్లు అర్జున్ స్టైల్‍ను అనుకరిస్తూ వీడియోలు కూడా చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here