Pushpa 2 : పుష్ప 2 నుంచి సెకండ్ సింగల్ ‘సూసేకి’ పాట వచ్చేసింది.. ఎలా ఉందంటే?

- Advertisement -

Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు, డైరెక్టర్ సుకుమార్ సెన్సేషనల్ హిట్ పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఈ మధ్యే ఫస్ట్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్. ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్‌కి ఆడియన్స్‌ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పాటలో హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు తాజాగా కపుల్ సాంగ్‌ ‘సూసేకి’ పాటను రిలీజ్ చేసింది పుష్ప 2 చిత్ర బృందం.

పుష్ప-శ్రీవల్లి మీద చిత్రీకరించిన ఈ పాటలో బన్నీ-రష్మిక అద్భుతం అనేలా అదరగొట్టేశారు. పుష్పలో ‘సామీ రారా సామీ’ పాట ఏ రేంజ్‌లో ఉందో అదే లెవల్లో ఉంటుంది ఈ కపుల్ సాంగ్. “సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ” అంటూ శ్రేయా ఘోషల్ గాత్రం అద్భుతంగా అనిపించింది. మొత్తం ఐదు భాషల్లోనూ ఈ పాటను శ్రేయా ఘోషల్‌ ఆలపించడం విశేషం. ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అయితే మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసేశాడు. ఈ మెలొడీ సాంగ్‌కి బన్నీ-రష్మిక తమ స్టెప్పులతో ఆడియన్స్‌ ను చూపుతిప్పుకోనివ్వలేదు. మొత్తానికి పాట సూసేకి చూసేందుకు సింపుల్‌గా ఉండి సంపేసింది. చంద్రబోస్ రాసిన లిరిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. ఇక వీడియోలో సుకుమార్ కూడా స్టెప్పులతో అదరగొట్టేశాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో పుష్ప 2 సెకండ్ సింగిల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. పాట అదిరిపోయిందంటూ బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here