Pushpa 2 : ‘పుష్ప 2 ‘ ఇక లేనట్టేనా..? క్లారిటీ ఇచ్చిన మూవీ టీం!

- Advertisement -

Pushpa 2 ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం, అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విబేధాలు ఏర్పడ్డాయి అనే వార్త. మన అందరికీ తెలిసిందే, వీళ్లిద్దరి కాంబినేషన్ లో పుష్ప చిత్రానికి సీక్వెల్ గా పుష్ప 2 అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి. సుకుమార్ ప్రతీ చిత్రాన్ని రాజమౌళి లాగ చిక్కుతునే ఉంటాడు, సమయం చాలా ఎక్కువ తీసుకుంటాడు. పుష్ప చిత్రం గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చెయ్యకుండానే విడుదల చేసారు, అప్పట్లో ఆడియన్స్ ఛీత్కారాలు కూడా తినాల్సిన పరిస్థితి వచ్చింది. సుకుమార్ పని తీరు ఇప్పటికీ అలాగే ఉంది. ఏ షాట్ కూడా ఆయనకీ ఒక పట్టాన నచ్చడం లేదు. సెట్స్ లో అందరి మీద ఊరికే కోపం తెచ్చుకుంటున్నాడు. ఇలా రీ షూట్స్ అంటూ సమయాన్ని మొత్తం వృధా చేస్తూ అల్లు అర్జున్ సహనం కి పరీక్ష పెడుతున్నాడు.

Pushpa 2
Pushpa 2

వాస్తవం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కేవలం 40 శాతం మాత్రమే పూర్తి అయ్యింది. అందుకే ఆగష్టు 15 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని, డిసెంబర్ 6 వ తేదికి వాయిదా వేశారు. ఇప్పుడు హీరో, డైరెక్టర్ మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా, గత కొంతకాలం నుండి సినిమా షూటింగ్ ఆగిపోయింది. సుకుమార్ ఈమధ్యనే ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లి వచ్చాడు. మరోపక్క అల్లు అర్జున్ కూడా రీసెంట్ గానే ఫారిన్ ట్రిప్ కి వెళ్ళాడు. ఆయన లుక్ ని చూసిన అభిమానులందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప కోసం పెంచిన గెడ్డాన్ని తీసేసి, చాలా స్టైలిష్ లుక్ లోకి వచ్చేసాడు. ఇది చూసి అసలు పుష్ప చిత్రం చేస్తున్నారా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు. విషయం ఏమిటంటే డిసెంబర్ 6 వ తేదీన ఎట్టిపరిస్థితిలోను సినిమా పూర్తి అవ్వాలి అనేది అల్లు అర్జున్ పట్టుబడుతున్నాడట.

Pushpa 2 release confirmed for August 15th despite speculations - The Statesman

- Advertisement -

ఇందుకోసం సుకుమార్ ని మూడు యూనిట్స్ ని ఏర్పాటు చేసి షూటింగ్స్ చేయాల్సిందిగా కోరాడట అల్లు అర్జున్. అందుకు సుకుమార్ ఒప్పుకోలేదట. ఇక్కడ ఇద్దరి మధ్య చెడింది. ఈ వార్త ఒక రేంజ్ లో వైరల్ అవుతుండగా, మూవీ టీం నుండి ఎలాంటి స్పందన రాలేదు కానీ, కొన్ని మీడియా సంస్థలకు చెందిన పీఆర్ఓ లు మాత్రం మరో రెండు రోజుల్లో పుష్ప రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని, అభిమానులు ఎలాంటి కంగారు పడొద్దు అంటూ ట్వీట్స్ వేశారు. అంతే కాకుండా ఆర్టిస్టుల డేట్స్ కూడా పుష్ప కి పెద్ద సమస్య గా మారింది. ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్న ఫహద్ ఫాజిల్ డేట్స్ ఇప్పుడు ఖాళీగా లేవు, ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఇలా పుష్ప 2 పూర్తి అవ్వడానికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్ళను అధిగమించి ఎలా షూటింగ్ పూర్తి చేస్తారు అనేది ఇప్పుడు చూడాలి.

Allu Arjun's Pushpa The Rule release date announced with new poster: 'Pushpa Raj is coming back to conquer' | Telugu News - The Indian Express

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here