Pushpa 2 టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన సినిమా పుష్ప.. ఆ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. అల్లు అర్జున్ రికార్డులను బద్దలు కొట్టింది..దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. పుష్ప ది రైజ్ సూపర్ హిట్ కావడంతో పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఏడాదిన్నర పూర్తి అయినా గాని ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు.. ఇప్పుడు సుక్కు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్ ను వదిలారు..

ఒక పవర్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. తిరుపతి జైలు నుంచి బులెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప అంటూ మొదలయింది గ్లింప్స్. పుష్ప ఎక్కడ అంటూ మీడియా అండ్ పోలీస్ లో చూస్తుంటే, పుష్పని ఏమి చేశారంటూ ప్రజలు ధర్నాలు చేస్తున్న విజువల్స్ గ్లింప్స్ లో కనిపిస్తున్నాయి. దీని బట్టి చూస్తుంటే భన్వార్ సింగ్ షేఖావత్ పుష్పని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు..ఆ వీడియో కోసం బన్నీ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు..

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతినాయకులుగా కనిపించగా.. సెకండ్ పార్ట్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కి దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ వీడియో ప్రస్తుతం ట్రేండింగ్ అవుతుంది.. ఈ వీడియోను చూసిన వారంతా కూడా సుక్కు లైనప్ పైనే చర్చలు జరుపుతున్నారు.. మొదటి పార్ట్ లో పుష్పను చూపించి క్రేజ్ ను పెంచితే.. ఈ పార్ట్ లో లేకుండా సినిమాను చూపించాడు.. అంటే ఈ పార్ట్ లో పుష్ప అజ్ఞాతంలోకి వెళతాడని తాజాగా రిలీజ్ అయిన వీడియోను చూస్తే తెలుస్తుంది.. సినిమా మొత్తం ఇక ఛేజ్ లు, ఫైర్ లు ఉంటాయాని జనాలు అంచనా వేస్తున్నారు.. సుక్కు ప్లాన్ ఇంత సింపుల్గా ఉంటుందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..