మూడేళ్లుగా రోజూ రాత్రి పూట అదే పని చేస్తున్నా.. లేకుంటే నిద్ర పట్టదు..: పూరీ జగన్నాథ్

- Advertisement -

చిత్రసీమలో డాషింగ్ డైరెక్టర్ అంటే అందరికి టక్కున గుర్తుకొచ్చే పేరు పూరి జగన్నాధ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు , మాస్ రాజా రవితేజ , కింగ్ నాగార్జున , నందమూరి బాలకృష్ణ , హీరో రామ్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో వర్క్ చేసి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు పూరి.

పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్

ప్రస్తుతం ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. రామ్ తో ఇస్మార్ట్ శంకర్ 2 తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో తనకు సంబదించిన ఓ బ్యాడ్ అలవాటు గురించి తెలిపి షాక్ ఇచ్చాడు. ” మీరు డ్రగ్స్ తీసుకుంటారా ..?” అనే ప్రశ్న కు.. “డ్రగ్స్ తీసుకునే అలవాటైతే నాకు లేదు కానీ.. డైలీ మందు కొట్టే అలవాటైతే ఉంది . అది కూడా నా ఫ్రెండ్ ఆర్జీవి దగ్గర నుంచే నేర్చుకున్నాను.. ఆ వెధవ అలవాటుని మాన్చలేకపోతున్నాను ..డైలీ రాత్రి మందు కొట్టనిదే నిద్ర పట్టదు.

గత మూడేళ్లుగా రోజు ఆ పని చేస్తూనే వచ్చాను. అది మానుకోవాలని ట్రై చేస్తున్న.. అవ్వట్లేదు ” అంటూ ఓపెన్ గా తనలో ఉన్న బ్యాడ్ అలవాటు ను చేసి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పూరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఆర్జీవి పేర్లు కూడా ఇంక్లూడ్ చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది . ఇంకా ఆర్జీవి దగ్గర నుంచి ఎలాంటి చండాలమైన అలవాట్లు నేర్చుకున్నాడో పూరి జగన్నాథ్ అంటూ కొందరు వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here