దడపుట్టిస్తున్న ప్రాజెక్ట్ కె నటుల పారితోషికాలు..

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో వైజయంతీ మూవీస్ ఒకటి. 1972లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థకు అధిపతి అశ్వనీ దత్ చలసాని అని తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో అశ్వనీ దత్ తో పాటు ఆయన కుమార్తె స్వప్న దత్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. అలాగే ఆమె స్వప్న సినిమాస్ అనే ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి అనేక సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి. ఇప్పుడు ఈ సంస్థ జూబ్లీ గోల్డెన్ మూవీగా వస్తోన్న ప్రాజెక్ట్ కె నటీనటుల పారితోషికాలు ఆసక్తిగా మారాయి. ఎవరికీ ఎంత రెమ్యునరేషన్ ముట్టజెపుతున్నారనే వివరాల్లోకి వెళితే..

ప్రాజెక్ట్ కె
ప్రాజెక్ట్ కె

దాదాపు రూ.500 కోట్ల‌కు మించి బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఇంత‌కీ ఈ సినిమ‌యా ఎలా ఉండ‌బోతోంది?..ఇండియన్ సినీ హిస్ట‌రీలో స‌రికొత్త చ‌రిత్ర‌ని లిఖించ‌బోతోందా?..హాలీవుడ్ మేక‌ర్స్‌ని సైతం ఈ సినిమాతో అబ్బుర‌ప‌ర‌చ‌బోతున్నారా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా బ‌డ్జెట్‌, ఇందులో న‌టించే స్టార్స్ పారితోషికాల‌పై కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. బాలీవుడ్ లో రూ.400 కోట్ల‌తో నిర్మించిన ప‌ఠాన్‌ అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమాగా వార్త‌ల్లో నిలిచింది. అయితే ప్రాజెక్ట్ కెని అంత‌కు మించిన బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దీంతో ఇందులో న‌టించే న‌టీన‌టుల పారితోషికాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ సినిమా కోసం ప్ర‌భాస్ రూ.150 కోట్లు తీసుకుంటుండ‌గా, కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న క‌మ‌ల్ హాస‌న్ రూ.20 కోట్లు, అమితాబ్ బ‌చ్చ‌న్, దిషా ప‌టానీ రూ.20 కోట్లు తీసుకుంటున్నార‌ట‌. అంతే కాకుండా హీరోయిన్‌లు దీపికా ప‌దుకునే రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నార‌ట‌. అంటే కీల‌క‌ ఆర్టిస్ట్‌ల పారితోషికాలే రూ.200 కోట్లు దాటుతున్నాయ‌ని, మిగ‌తా బ‌డ్జెట్ మిగ‌తా ఆర్టిస్ట్‌లు, టెక్నిష‌య‌న్స్‌, మేకింగ్‌కు రూ.300 కోట్ల‌కు మించి ఖ‌ర్చే చేస్తున్నార‌న్న‌మాట‌. ఈ సినిమాకు వీఎఫ్ ఎక్స్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుంది. దీంతో వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ కోసం కూడా మేక‌ర్స్ భారీగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here