NTR : జూనియర్ ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని అందరిలో చెప్పిసిన నిర్మాత.. ఇక ఆ వార్తలకు బ్రేక్..

- Advertisement -

NTR : చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడం లేదంటూ వస్తున్న విమర్శలపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటి మనిషి అయిన జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు కావాలని దూరం చేసుకున్నారని చెప్పారు.

NTR
NTR

సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ కు సమాన స్థాయి ఉందన్న ఆయన, పవన్ ను దగ్గరికి తీసుకుని ఎన్టీఆర్ ను దూరం పెట్టారని విమర్శించారు. ఎన్టీఆర్ ను వదులుకోవడంతోనే టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భరద్వాజ, టీడీపీ రాజకీయాలు, చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యవహరించిన తీరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు భరద్వాజ.

ఎన్నికల ప్రచారంలో శక్తివంచన లేకుండా దూసుకెళ్లరన్నారు. చివరకు తన ప్రాణాలను పణంగా పెట్టి పార్టీ కోసం పని చేశారని చెప్పారు. చావు బతుకుల మధ్య హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారని చెప్పారు. అంతలా కష్టపడి పని చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను 2014 ఎన్నికల్లో సరైన న్యాయం జరగలేదని చెప్పారు. దాని ఫలితం ఇదేనని వ్యాఖ్యలు చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here