Bigg Boss Telugu : బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ 2.0లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్తగా అయిదుగురు కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పాత కంటెస్టెంట్స్ వారి చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన అయిదుగురిలో అర్జున్ అంబటి, పూజా సీరియల్స్ బ్యాచే కాబట్టి అప్పటికే హౌజ్‌లో పాత సీరియల్ బ్యాచ్ అయిన శోభా శెట్టి, అమర్‌దీప్, ప్రియాంకలతో త్వరగానే క్లోజ్ అయిపోయారు. కానీ అలా క్లోజ్ అయిన శోభా, పూజల రీసెంట్ ఎపిసోడ్లో గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా ఇద్దరూ కన్నీటి పర్వంతం కూడా అయ్యారు. ఇక కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు, ప్రియాంక ఒకవైపు అయిపోయి కిచెన్‌లో పనులు చేసి తాను చాలా అలసిపోయానంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 మొదలయినప్పటి నాగార్జున ఈ సారి అంతా ఉల్టా ఫల్టా అంటూ చెప్పుకొస్తున్నారు. కొత్త కొత్త టాస్కులు ఊహించని ట్విస్టులతో సీజన్ ను రక్తి కట్టిస్తున్నారు. ఈ సీజన్ మొదటి నుంచి కిచెన్‌లో కొందరు కంటెస్టెంట్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతకు ముందు దామిని కిచెన్ బాధ్యత చూసుకునేది. తన తర్వాత ఇప్పుడు ప్రియాంక అందరి ఫుడ్ బాధ్యతను చూసుకుంటుంది.
కానీ కిచెన్‌లో తాను ఎంత కష్టపడుతున్నా ఎవరూ గుర్తించడం లేదు.. పైగా ఫుడ్ వేస్టు అవుతున్న విషయంలో ఎవరూ తన మాట వినడం లేదు. తన తోటి కంటెస్టెంట్స్ అయిన సందీప్, గౌతమ్‌లతో ఇదే విషయాన్ని చెప్తూ ప్రియాంక కన్నీళ్లు పెట్టుకోవడం రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో కనిపిస్తోంది. ఇంకా ఆ ప్రోమోలో.. ‘‘నాకు చాలా బాధగా ఉంది. నేను చాలా అలసిపోయాను.

ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కలాగా తన గురించి మాట్లాడుతున్నారు. మనం బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత మా ఇంటికి రండి ఎవరికి ఎంత కావాలో అంత చేసి పెడతాను. కానీ ఇక్కడ మనం చేయలేం. నేను అలసిపోయాను. నేను అందరికీ చెప్పుకుంటున్నాను’’ అంటూ ప్రియాంక కన్నీటి పర్వంతం అయింది. ప్రియాంక బాధలో న్యాయం ఉందంటూ ప్రోమో చూసిన ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. నాగ్ సార్ ఈ రోజు కచ్చితంగా ఈ విషయం గురించి మాట్లాడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.