Priyanka Arul Mohan : ఫారెస్ట్​లో OG బ్యూటీ క్రేజీ పోజులు

- Advertisement -

Priyanka Arul Mohan .. ఈ మలయాళీ కుట్టి టాలీవుడ్​లో నేచురల్ స్టార్ నాని సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. గ్యాంగ్ లీడర్ సినిమాలో ఈ భామ అందం, అభినయానికి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఆ చిత్రంలో ట్రెడిషనల్​ లుక్​లో ప్రియాంకను చూసి మెస్మరైజ్ అయ్యారు. ఈ బ్యూటీ కళ్లకు ఓ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ భామను తొలి సినిమాలోనే చూసి తెలుగు కుర్రకారు ప్రేమలో పడిపోయారు. ఆ తర్వాత ఈ బ్యూటీ శర్వానంద్​తో కలిసి శ్రీకారంలో నటించింది. ఈ మూవీలో కాస్త మోడ్రన్ లుక్​లో సందడి చేసింది. మోడ్రన్ లుక్​లోనూ ప్రియాంక తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

Priyanka Arul Mohan
Priyanka Arul Mohan

ఇప్పుడు టాలీవుడ్​లో ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అయింది ప్రియాంక. అయితే థర్డ్ సినిమాకే ఈ బ్యూటీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. పవర్​ స్టార్​ పవన్​-సుజిత్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక నటిస్తున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్​ ప్రకటించింది. 

Priyanka Arul Mohan photos

ఇన్ని రోజులుగా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో హీరోయిన్​గా ఎవరు నటిస్తున్నారన్న సస్పెన్స్​కు ఒక్కసారిగా తెరపడింది. ట్విటర్​ వేదికగా ప్రియాంకకు సెట్స్​లోకి వెల్​కమ్​ చెప్పింది. అయితే గత కొద్ది రోజులుగానే ప్రియాంక ఈ సినిమాలో నటించమనుందన్న వార్త సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్​ అయ్యింది. అయితే ఈ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఇది నిజమే అని అభిమానుల్లో క్లారిటీ వచ్చింది.

- Advertisement -
Priyanka Arul Mohan Stills

ఇక ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. ఇక పవన్ కల్యాణ్​తో సినిమా అనేసరికి ఈ భామ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఈ బ్యూటీ తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ భామ వైట్ కలర్ ఔట్​ఫిట్​లో సందడి చేసింది. ఫారెస్ట్​లో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ప్రియాంక క్రేజీ పోజులిచ్చింది. సిగ్గు పడుతూ.. క్యాజువల్​ గా.. క్యూట్​గా ఇలా రకరకాల పోజులతో ఫొటోలు దిగింది. అవికాస్త నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here