Big Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత హీట్ వాతావరణం లో ముందుకెళ్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. నామినేషన్స్ లో ఈ వారం ఉన్న కంటెస్టెంట్స్ మొత్తం స్ట్రాంగ్ గా ఉన్నవాళ్లే. ఇలా ఇప్పటి వరకు నామినేషన్స్ ఈ సీజన్ లో జరగడం ఇదే తొలిసారి. హౌస్ లోకి భోలే వచ్చిన తర్వాత సమీకరణాలు చాలా మారాయి. అతనితో శివాజీ బ్యాచ్ తప్ప హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరు గొడవ పడుతూనే ఉన్నారు.

భోలే వేసే వేషాలు కూడా అలాగే ఉన్నాయి. అతను అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక ని అవమానించడానికే హౌస్ లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అమర్ దీప్ ని ఒక పనికిమాలిన వాడిలాగా ప్రొజెక్ట్ చెయ్యాలని ప్రయత్నిస్తున్న శివాజీ కి తోడుగా భోలే కూడా నిలిచాడు. నువ్వు ఏ ఆటకి పనికి రావు అంటూ భోలే అమర్ ముఖం మీదనే నిన్న చెప్పడం మనమంతా గమనించే ఉంటాం.

అమర్ దీప్ కూడా సరిగ్గా భోలే మాటల్ని నిజం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. కెప్టెన్సీ టాస్క్ మొదటి రౌండ్ లో ప్రియాంక, శోభా శెట్టి, అమర్ దీప్ మరియు తేజా పాల్గొన్నారు. ఈ టాస్కులో ప్రియాంక గెలిచింది, అమర్ దీప్ మరియు శోభా ఓడిపోయారు. మరోపక్క సెకండ్ రౌండ్ లో ప్రిన్స్ యావర్ , గౌతమ్ కృష్ణ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య పోటీ జరిగింది.

ఈ టాస్కు లో యావర్ మరియు గౌతమ్ లను ఓడించి పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు. ఇలా ప్రతీ ఒక్కటి శివాజీ మరియు భోలే అమర్ ని జనాలకు ప్రొజెక్ట్ చేస్తున్న విధానం గానే అమర్ దీప్ కి ఫలితాలు వస్తున్నాయి. మరోపక్క అమర్ దీప్ గెలవాలని ఆయన్ని అభిమానించే వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. కానీ అమర్ దీప్ ప్రారంభం లోనే ఇలా బోల్తా కొట్టి వారిని నిరాశపరిచాడు. మరి ఆయనకీ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే మరో ఛాన్స్ వస్తుందో లేదో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాలి.
