Priya Prakash Warrior : కన్ను గీటడం, గన్ తో ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం.. సీన్ లతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒరు అదార్ లవ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ.. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని సెన్సేషనల్ స్టార్ అయింది.. ఆ తరువాత వరుస ఆఫర్లను అందుకుంది.. మరీ ముఖ్యంగా ఈ చిన్నది శ్రీదేవి బంగ్లా అనే బాలీవుడ్ సినిమాలను నటించింది.
సౌత్ ఇండియా నుంచి వచ్చి దేశవ్యాప్తంగా పాపులర్ అయి.. సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా కాలంగా బాగా రచ్చ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గాయాలు చేస్తుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది..
ప్రియా ప్రకాష్ వారియర్ గ్రీన్ కలర్ శారీలో స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది.. పింక్ వైట్ కాంబినేషన్లో జువెలరీ సెట్ పెట్టుకొని గ్రీన్ సారీ లో జస్ట్ గోడకి అలా నిలబడి చూసే ఆమె చూపులు కుర్రాళ్ళ మతులు గతులు తప్పేలా చేస్తున్నాయి.. దేవకన్యలా మెరిసిపోతున్న ఈ వింకీ బ్యూటీ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ భ్రమ్మే అందం పోత పోస్తే నీలానే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అంతకుమించిన కామెంట్లతో ప్రియా ప్రకాష్ వారియర్ అందాన్ని ఆకాశాన్ని ఎత్తేస్తున్నారు.
తెలుగులో ఇప్పటికే చెక్ సినిమాతో నితిన్ కి లవ్ ఇంట్రెస్ట్ గా చేసింది. దాంతోపాటు ఇష్క్ సినిమాలోని మెరిసింది. అది కూడా పెద్దగా ఆడలేదు.. ప్రస్తుతం ఈ మలయాళ బ్యూటీ చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. విష్ణు ప్రియ అనే కన్నడ మూవీ, మలయాళం లో కొల్లా, ఓరు నాల్పతుకారంతే ఇరపథోన్నుకారి తో పాటు హిందీలో నాలుగు చిత్రాలలో నటిస్తోంది. అందులో శ్రీదేవి బంగ్లా ఏరియా టు త్రీ మంకీస్ లవ్ హ్యాకర్స్ అని చిత్రాలలో నటిస్తూ ప్రియా ప్రకాష్ కెరియర్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. మరోవైపు గ్లామర్ షో చేస్తూ నైటీజన్ల ఫాలోయింగ్ పెంచుకుంటుంది. కమర్షియల్ యాడ్స్ ను దక్కించుకుంటూ రెండు చేతుల సంపాదిస్తోంది వింకీ బ్యూటీ..