Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాప్ మోస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో ప్రిన్స్ యావర్ పేరు కచ్చితంగా ఉంటుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే ప్రతీ టాస్కులో నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెట్టి ఆడింది ఒక్క యావర్ మాత్రమే. సండే రోజు ఫన్ కోసం ఆడే గేమ్స్ లో కూడా తన బెస్ట్ ఇచ్చి చేతికి గాయం తగిలించుకుంటాడు.

ఇవన్నీ పక్కన పెడితే యావర్ లో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఇతనిలో ఉన్న ఓవర్ అగ్రెసివ్ హౌస్ ని షేక్ చేసే విధంగా ఉంటుంది. అనేక సార్లు గొడవ జరిగినప్పుడు తన తోటి కంటెస్టెంట్స్ పై కొట్లాట జరిగే రేంజ్ కి మీదకి వెళ్ళిపోతాడు. వీకెండ్స్ లో నాగార్జున నుండి కోటింగ్స్ రావడం తో ఈమధ్య కాస్త తగ్గింది. కానీ నిన్న శోభా శెట్టి తో మరోసారి ఆయన పిచ్చి వాడిలాగా గొడవ పడుతాడు.

ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి రతికా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత యావర్ గేమ్ పూర్తిగా మారిపోయింది. పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు అంటూ యావర్ ని అభిమానించే వారు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య కాలం లో యావర్ ప్రతీ విషయం లో రతికా కి సపోర్టు ఇస్తున్నాడు. అంతే కాదు మొన్న వంటింట్లో కూడా తేజా తో రతికా కోసం గొడవ పడుతాడు.

ఇది గమనించిన తోటి కంటెస్టెంట్స్ ఒక్కసారిగా షాక్ కి గురి అవుతారు. అలా రతికా విషయం లో యావర్ ఇంత సపోర్టివ్ గా ఉండడం వల్ల అతని గేమ్ బాగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఇంతకు ముందుతో పోలిస్తే యావర్ గ్రాఫ్ ఇప్పుడు బాగా పడిపోయింది. అతని స్థానం లోకి అమర్ వచ్చేసాడు. ఈ వారం లో యావర్ తన ఆట తీరుని మెరుగుపర్చుకోకపోతే టాప్ 5 స్థానం దక్కడం కష్టమే.