సంధ్య సౌత్ ఇండియన్ యూత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమాలు కొన్ని ఉంటాయి.ఆ చిత్రాలను కానీ, అందులో నటించిన వాళ్ళను కానీ మనం ఎప్పటికీ మరచిపోలేము. అంత గొప్పగా వాళ్ళు ఆ పాత్రల్లో జీవించారు కాబట్టే మనం మర్చిపోలేకున్నాము.అలాంటి సినిమాలలో ఒకటి ‘ప్రేమిస్తే’.సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, బాలాజీ శక్తివేల్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీ పరిచయం అయ్యాడు.

ఇందులో హీరో హీరోయిన్లు గా నటించిన భరత్ మరియు సంధ్య ఇద్దరు తమిళ సినిమా ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళే. వీళ్లకు ఈ సినిమా ద్వారా అప్పట్లో మామూలు రేంజ్ క్రేజ్ రాలేదు. భరత్ స్టార్ హీరో గా ఎదిగిపోయాడు, ఇక సంధ్య కూడా అదే రేంజ్ లో ఎదిగిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగు , మలయాళం మరియు తమిళ భాషలకు కలిపి 50 సినిమాల్లో హీరోయిన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించింది.

ఈమె తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘అన్నవరం’ సినిమాలో చెల్లెలు పాత్ర పోషించింది. కమర్షియల్ గా హిట్ రేంజ్ లో ఆడిన ఈ సినిమా ద్వారా సంధ్య కి మంచి పేరు వచ్చింది. 2016 వ సంవత్సరం వరకు సినిమాల్లో యాక్టీవ్ గా నటించిన ఈమె 2016 తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. 2015 వ సంవత్సరం లో ఈమె అర్జున్ అనే IT ఉద్యోగిని ప్రేమించి పెళ్లాడింది.

సంధ్య ఆ తర్వాత ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి,సినిమాలకు దూరం అయ్యింది. అలా కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన ఈమె ‘కన్మణి’ అనే తమిళ సీరియల్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. సన్ టీవీ లో ప్రసారమయ్యే ఈ సీరియల్ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికీ మంచి పాత్రలు దొరికితే సినిమాల్లో నటించడానికి కూడా సిద్ధం అంటుంది సంధ్య. అయితే చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో ఈమె ఫోటోలను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు అలా ఉండే అమ్మాయి, ఇప్పుడు ఇలా అయ్యిందేంటి అంటూ షాక్ కి గురి అయ్యారు.ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని క్రింద అందిస్తున్నాము చూడండి.


