Pallavi Prashanth : ఇప్పటి వరకు జరిగిన అన్నీ సీజన్స్ లో కూడా చివరి రెండు వారాలు బిగ్ బాస్ హౌస్ చాలా ప్రశాంతంగా, ఫన్నీ టాస్కులతో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ పంచే విధంగా ఉండేవి. కానీ ఈ సీజన్ లో మాత్రం ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా హీట్ వాతావరణం లో జరిగింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ మరియు అమర్ మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంది.
ఈ సీజన్ రెండవ వారం వీళ్లిద్దరి మధ్య ఏ రేంజ్ లో గొడవ జరిగిందో మనమంతా చూసాము. మళ్ళీ ఆ రేంజ్ గొడవ మధ్యలో ఒకసారి జరిగింది, మళ్ళీ ఈ చివరి నామినేషన్స్ ప్రక్రియ లో కూడా జరిగింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఎవరిదీ తప్పు ఎక్కువ ఉంది అంటే, ఇద్దరిదీ సమానంగా ఉందనే చెప్పాలి. కానీ పల్లవి ప్రశాంత్ చాలా వ్యక్తిగతంగా తీసుకొని అమర్ దీప్ క్యారక్టర్ పై చేసిన కామెంట్స్ చాలా తప్పు అనిపించింది.
ముందుగా ప్రశాంత్ అమర్ ని నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత కాసేపటికి అమర్ దీప్ ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ ఈ సీజన్ మొత్తం నువ్వు సిల్లీ నామినేషన్స్ వేశావు, నువ్వు వేసిన ఆ నామినేషన్స్ వల్ల చాలా మంది బయటకి వెళ్లిపోయారు అని అంటాడు. అక్కడి నుండి మొదలైన గొడవ తారా స్థాయికి చేరుకుంది. పాత విషయాలు మొత్తం తవ్వుకున్నారు.
నీకు సపోర్ట్ చేస్తే నాకు నమ్మక ద్రోహం చేసి నామినేట్ చేసావు, నీది క్యారక్టర్ అంతే, నువ్వో పెద్ద మోసగాడివి అంటూ అమర్ దీప్ ని అంటాడు. నువ్వు నాకు సపోర్ట్ చేసావా?, నిజంగా చేసేవాడివే అయితే మొన్న కెప్టెన్సీ టాస్కు సమయం లో శోభా పిలిచినప్పుడు ఎందుకు నువ్వు రాలేదు? అని అంటాడు. అలా ఇద్దరి మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరుకోవడం, ప్రశాంత్ అమర్ ని నమ్మక ద్రోహి, మోసగాడు ఇలా ఎన్నో రకాల వ్యక్తిగత దూషణలు చేస్తాడు. ఇది ఆయనకీ ప్లస్ అవుతుందో, లేదా మైనస్ అవుతుందో చూడాలి.