Animal : యానిమల్ లో ఆ సీన్స్ కంటే.. డీప్ ఫేక్ వీడియోనే బెటర్.. రష్మికపై మండిపడుతున్న నెటిజన్లు..

- Advertisement -

Animal : రష్మిక పేరు.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆమె డీప్ ఫేక్ వీడియో రిలీజ్ అయ్యి ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు సపోర్ట్ గా చిత్ర పరిశ్రమ మొత్తం కదిలివచ్చింది. ఇక దానిపై ఎన్నో చర్చలు, సమావేశాలు కూడా జరిగాయి. ఎవరో ఒక అమ్మాయి జిమ్ నుంచి బయటకు వస్తున్న వీడియోకు ఫేస్ మార్చి రష్మిక ఫేస్ పెట్టి.. రష్మిక క్లివేజ్ షో చేస్తుందని సోషల్ మీడియాలో రచ్చ చేశారు.

Rashmika Mandanna Ranbir Kapoor

అది ఫేక్ అని తెలియడంతో.. దానిపై రష్మిక చాలా ఘాటుగా స్పందించింది. ఇది ఇప్పుడు జరిగింది.. దీని గురించి మీ అందరికి తెలుసు.. ఇదే కనుక నేను చదువుకొనే రోజుల్లో జరిగి ఉంటే.. దాన్ని నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది. ఇక రష్మిక ఫ్యాన్స్ తో పాటు.. మిగతావారు కూడా ఆమెకు సపోర్ట్ చేశారు. ఇదంతా అయిపోయింది. అయితే ఆ డీప్ ఫేక్ వీడియో కన్నా ఘోరంగా రష్మిక కనిపించడం ఇప్పుడు నెట్టింట హీట్ ను రాజేస్తోంది. రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

కొంతమంది బావుంది అంటుండగా.. ఇంకొంతమంది మరీ దారుణంగా ఉంది అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇందులో రష్మిక, రణబీర్ తో లిప్ లాక్ లు, రొమాన్స్ తో రెచ్చిపోయింది. ముఖ్యంగా ఆమె రణబీర్ ముందు డ్రెస్ తీసి.. బ్రాతో నిలబడడం.. క్లివేజ్ కనిపించడం జరిగాయి. దీంతో రష్మికపై కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. డీప్ ఫేక్ వీడియో కన్నా.. ఇదే ఘోరంగా ఉంది కదా.. ఏంటి రష్మిక ఇది.. ? అంటూ ప్రశ్నిస్తున్నారు. కథను బట్టి ఒక నటిగా అలాంటి సీన్స్ చేయాల్సి వస్తే .. ఎవరైనా చేస్తారు.. అదే రష్మిక కూడా చేసింది అని ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here