Prashanth Varma : జై హనుమాన్.. ఈసారి ప్రశాంత్ వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా

- Advertisement -

Prashanth Varma : ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఈ సంవత్సరానికే తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కురిపించిన కలెక్షన్ల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఈ మూవీ సూపర్ కలెక్షన్లు వసూల్ చేసింది. స్టార్ కాస్ట్ లేకపోయినా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన కలెక్షన్లు వసూల్ చేసిన సినిమాగా రూపొందించింది.

అ!, కల్కి చిత్రాలతో తన వర్సటాలిటీని చూపించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. యువ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇద్దరు కూడా విడుదలకు ముందే ప్రమోషన్ చేసిన విధానం కూడా సినిమాను జనాలకు ఇంకా బాగా దగ్గర చేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ ముందుగానే చెప్పాడు. దానికి జైహనుమాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

- Advertisement -

ఈ చిత్రం హనుమాన్ సినిమాను మించేలా ఉంటుందని ప్రశాంత్ వర్మ అన్నారు. ఎప్పటికప్పుడు ఆ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ జనాల్లో హైప్ క్రియేట్ చేసారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ ఈ సినిమా గురించి ప్రశాంత్ వర్మ ఓ సూపర్ అప్డేట్ ఇచ్చారు. స్పెషల్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీరాముడి చేతిలో ఆంజనేయుడు చేయి వేసి ఏదో మాటిస్తున్నట్లు కనిపిస్తోంది. హనుమాన్ సినిమా చివరలో కూడా శ్రీరాముడు హనుమాన్ మధ్యలో ఒక వాగ్దానం ఉంటుందని వివరణ ఇచ్చారు. ఇక ఆ వాగ్దానం ఏమిటి అనేది జై హనుమాన్ లో తెలుస్తుందన్నమాట.

హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతూ ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజు అందరికీ నేను మాట ఇస్తున్నాను.. అని ప్రశాంత్ వర్మ ఈ పోస్టర్ కింద క్యాప్షన్ ఇచ్చాడు. అయితే జై హనుమాన్ లో హనుమంతుడిగా కనిపించేది ఎవరు? అలాగే శ్రీరాముడిగా ఏ హీరో కనిపిస్తాడు అనేది జనాల్లో ఆసక్తిగా మారింది. ఆ మధ్య రానా దగ్గుబాటి హనుమాన్ గా కనిపించబోతున్నాడు అంటూ రకరకాల గాసిప్స్ వచ్చాయి. కానీ మేకర్స్ ఇంకా ఆ విషయంపై స్పందించలేదు. మొత్తానికి హనుమాన్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు జై హనుమాన్ తో మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించడానికి రెడీ అయ్యాడన్నమాట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here