Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ షో చివరో దశకి చేరుకుంది. ఈ సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ది బెస్ట్ అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాస్కులు ఆడడం లో కానీ, ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ ఈ సీజన్ లోని కంటెస్టెంట్స్ రేంజ్ లో ఇంతకు ముందు సీజన్స్ లో లేరనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం శివాజీ, అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్.

ముందుగా రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ లో అమర్ దీప్ మరియు ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియా లో పెను దుమారమే రేపింది. ఈ గొడవ ప్రశాంత్ కి బాగా ప్లస్ అయ్యింది, అమర్ కి బాగా మైనస్ అయ్యింది. రైతు ని అలా టార్గెట్ చెయ్యడానికి మనసు ఎలా వచ్చింది అంటూ అమర్ దీప్ పై అందరూ విరుచుకుపడ్డారు.

ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ అమర్ దీప్ ని అందరూ అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అమర్ అమాయకుడు అని, మనసులో ఏది ఉంటే అదే మాట్లాడుతాడని అందరికీ అర్థం అయ్యింది. మరోపక్క కామన్ మ్యాన్ గా హౌస్ లో అడుగుపెట్టి తన అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ ఇప్పుడు టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు. ఆయన తో సమానంగా అమర్ కూడా పోటీ ని ఇస్తున్నాడు.

యూట్యూబ్ పోల్స్ లో ప్రశాంత్ టాప్ 1 లో ఉండగా, అమర్ దీప్ టాప్ 2 స్థానం లో ఉన్నాడు. అలాగే ఇంస్టాగ్రామ్ లో అమర్ దీప్ టాప్ 1 లో ఉండగా, ప్రశాంత్ టాప్ 2 లో ఉన్నాడు. ఇక శివాజీ అయితే అన్నీ మాధ్యమాలలో టాప్ 3 స్థానం లోనే ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ప్రశాంత్ కి ఉన్నాయి. ఎందుకంటే అతను అమర్ కంటే టాస్కులు అద్భుతంగా ఆడాడు, దానికి తోడు కామన్ మెన్ అనే సానుభూతి చాలా బలంగా పనికొచ్చే అవకాశాలు ఉన్నాయి,చూడాలి మరి.
