Prashanth Varma దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బడ్జెట్ పరంగా చిన్న చిత్రంగా వచ్చిన ఈ సూపర్ హీరో సినిమా ఇప్పటి వరకు రూ.270 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. ఇంకా హనుమాన్‍కు కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు.

కాగా, హనుమాన్ చిత్రానికి సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ మూవీ రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జై హనుమాన్ చిత్రంలో శ్రీరాముడు, ఆంజనేయ స్వామి పాత్రలు ప్రధానంగా ఉండనున్నాయి. దీంతో ఈ చిత్రంలో శ్రీరాముడు, హనుమంతుడుగా ఎవరు నటిస్తారోనన్న ఉత్కంఠ ఉంది. ఈ మూవీలో స్టార్ హీరోలు నటిస్తారని ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే, శ్రీరాముడి పాత్రకు ఏ హీరో అయితే బాగుంటుందని తాను అనుకున్నారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పారు.

“రాముడి క్యారెక్టర్ నాకు మహేశ్ బాబుతో చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. నాకు ఆ విషయం మైండ్‍లో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి” అని ప్రశాంత్ వర్మ చెప్పారు. మహేశ్ బాబు రాముడిగా ఎలా ఉంటారో గ్రాఫిక్స్‌లో చూశామని ఆయన తెలిపారు. హనుంతుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం ఉందని ప్రశాంత్ వర్మ చెప్పారు. పద్మ విభూషణ్ తర్వాత చిరంజీవి బిజీగా ఉంటున్నారని, ఆయనకు వీలున్నప్పుడు కలుస్తానని తెలిపారు.