‘బిగ్ బాస్’ సీజన్ 7లో రోజురోజుకూ హీట్ పెరుగుతోంది. నామినేషన్లు, తిట్లు, ప్రేమలు అబ్బో ఓ రేంజ్లో ఉంటోంది. తాజాగా ప్రశాంత్ నామినేషన్ పై కంటెస్టెంట్ మాట్లాడారు. ‘అసలు రైతుబిడ్డ అనేది లేకపోతే ప్రశాంత్ ఎవరు’ అని ముందుగా పల్లవి ప్రశాంత్‌ను ప్రశ్నించింది రతిక. ‘నువ్వు రైతుబిడ్డ అనే సెంటిమెంట్ దారి ఎంచుకున్నావు.

‘బిగ్ బాస్’ అంటే అంత ఇష్టమయితే ‘బిగ్ బాస్’ ఎందుకు చూడలేదు? సీజన్స్ అన్నీ చూసి చాలా నేర్చుకొని వచ్చావు. నీలో బయట ఉన్న వినమ్రత అదంతా ఇక్కడ లేదు. ఇక్కడ నీలో ఉన్న ఇంకొక యాంగిల్ బయటికొస్తుంది. అవకాశం వచ్చేవరకు ఒక ప్రశాంత్, అవకాశం వచ్చాక ఒక ప్రశాంత్‌లాగా ఉన్నావు. ఇలా ఉంటే బయట ఆడియన్స్ ప్రోత్సహించరు. రైతు అని నువ్వు ప్లే చేస్తున్న సెంటిమెంట్‌ను నమ్మడానికి ఎవరు పిచ్చివాళ్లు కాదు.

నీ ఒరిజినాలిటీ తెలిస్తే వారే బయటికి పంపిస్తారు’ అంటూ ప్రశాంత్‌ను నామినేట్ చేసి వెళ్లిపోయింది రతిక. ఆ తర్వాత శుభశ్రీ వచ్చి ఒరిజినాలిటీ లేదని, ‘బిగ్ బాస్’ ఇస్తే డబ్బు తీసుకోకుండా వెళ్లిపోతావా అని ప్రశ్నించింది. అవును తీసుకోను అని పల్లవి ప్రశాంత్ చెప్పిన సమాధానికి కంటెస్టెంట్స్ అంతా వ్యంగ్యంగా చప్పట్లు కొట్టారు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ నామినేషన్స్.. ‘బిగ్ బాస్’ ప్రేక్షకులకు నచ్చే విధంగా చాలా మజాగా సాగింది. నామినేషన్స్ తర్వాత కూడా కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.