Amar vs Prasanth : బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత దూరం వచ్చింది అంటే వ్యక్తిగతంగా సెలెబ్రిటీలు బయటకి వస్తే దాడి చేసేంత అన్నమాట. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్, మరియు రన్నర్ గా అమర్ దీప్ నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య హౌస్ లో తార స్థాయికి చేరిన గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా నామినేషన్స్ సమయం లో అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ రెచ్చిపోయిన సంఘటనలు హౌస్ లో మనం ఎన్నో చూసాము.
ఇక 14 వ వారం లో అమర్ దీప్ మరియు ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ వేరే లెవెల్ ఉన్నింది. అమర్ దీప్ నన్ను కొరికాడు అంటూ పల్లవి ప్రశాంత్ కెమెరా ముందుకు వెళ్లి డ్రామా చెయ్యడం, దానికి అమర్ దీప్ రెచ్చిపోయి, అదుపు తప్పి ప్రవర్తించడం. ప్రశాంత్ ని నెట్టుకుంటూ మెడికల్ రూమ్ కి వెళ్లడం వంటివి జరిగాయి.
ప్రశాంత్ మీద చెయ్యి వేస్తె రైతు బిడ్డ మీద చెయ్యి వేసినట్టుగా సోషల్ మీడియా లో కొన్ని పీఆర్ టీమ్స్ వ్యవహరించాయి. ముఖ్యంగా రివ్యూస్ చెప్పే వాళ్ళ ప్రభావం జనాల మీద చాలా తీవ్రంగా ఉందనే చెప్పాలి. ఈ ప్రభావం వల్ల అమర్ పై నెగటివిటీ పెరిగి అతని పై నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో దాడి చేసేలా చేసింది. షో ముగించుకొని బయటకి కార్ లో వెళ్తున్న సమయం లో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ కార్ దాడి చేసారు.
ఆ సమయం లో ఆ కార్ లో అమర్ భార్య తేజస్విని తో పాటుగా, ఆయన తల్లి రూప కూడా ఉన్నారు. వాళ్ళు ఒక్కసారిగా ఆ భయానక పరిస్థితి ని చూసి బెదిరిపోయారు. ఏమైపోతుందో ఏంటో అని హడలి పోయారు. చాలా సేపటి వరకు అమర్ కార్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ప్రశాంత్ ఫ్యాన్స్ కదలనివ్వలేదట. దానికి సంబంధించిన వీడియో ని క్రింద అందిస్తున్నాము చూడండి.