Prabhu Deva రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయి బ్యాగ్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

- Advertisement -

Prabhu Deva : సినీ నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, డ్యాన్సర్ ప్రభుదేవా మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.. ఈయన్ని ఇండియన్ మైకల్ జాక్సన్ గా అందరూ పిలుస్తారు.. ఈయన నటుడిగా.. కొరియోగ్రాఫర్ గా.. డాన్సర్ గా.. చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు.

అలాంటి ప్రభుదేవా సినీ కెరీర్ సక్సెస్ అయినప్పటికీ కూడా వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నాడు. ఇక ఈయన భార్య ఉండగానే హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు ప్రభుదేవా… ఆ తర్వాత నయనతార ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.. కానీ తన భార్య వల్ల చేసుకోలేక పోయాడు.. ఇప్పుడు తాజాగా రెండో పెళ్లి చేసుకున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..

Prabhu Deva
Prabhu Deva

అసలు సడెన్ గా ప్రభుదేవా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి అని ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు.. రెండో పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి బ్యాగ్ గ్రౌండ్ ఏంటి? వీరిద్దరికి ఎలా పరిచయం అని ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఆ అమ్మాయి పేరు హిమాని ముంబైకి చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్.. అలా పరిచయం ఏర్పడింది. ఇక ప్రభుదేవ కి ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో ప్రభుదేవా డాక్టర్ హిమానితో ప్రేమలో పడి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -

అయితే గతంలో వీరి గురించి కొన్ని పెళ్లి వార్తలు వినిపించినప్పటికీ ఎక్కడ కూడా ఈ జంట బయట కనిపించలేదు. అయితే తాజాగా ప్రభుదేవా బర్త్డే సందర్భంగా హిమాని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.. అదేంటంటే మీతో నా జర్నీ మూడేళ్లు పూర్తయింది.. మీరు చాలా ఎంజాయ్ పర్సన్.. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. అంటూ ప్రభుదేవని పొగుడుతూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక ఈమె పెట్టిన పోస్ట్ తో వీరి మధ్య ఉన్న పెళ్లి బంధం బయటపడింది.. సోషల్ మీడియాలో తెరపైకి కొత్త చర్చ మొదలైంది..

prabhu deva Photos

కాగా, ప్రభుదేవా రమాలత్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాక వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు.కానీ కొడుకు విశాల్ 13 సంవత్సరాల వయసులోనే ప్రాణాంతక వ్యాధితో చనిపోయారు. ఇక కొడుకు చనిపోయిన బాధలో ప్రభుదేవా చాలా రోజులు ఉన్నారు. అంతేకాకుండా ప్రభుదేవా ఇండస్ట్రీకి వచ్చాక నయనతారతో ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్లారు.

కానీ మొదటి భార్య నయనతార తో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చాలా గొడవలు జరిగాయి. చివరికి మొదటి భార్యతో ప్రభుదేవా విడిపోయారు. కానీ నయనతార తో ప్రభుదేవా పెళ్లి మాత్రం జరగలేదు. ఇక ఇటు భార్య లేక అటు ప్రేమించిన అమ్మాయి లేకపోవడంతో ప్రభుదేవా చాలా డిప్రెషన్ కి లోనయ్యారు. అయితే అలాంటి టైం లోనే ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకున్నారు.. మరి దీనిపై ప్రభుదేవా ఎలా స్పందిస్తారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here