యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి నేటి తరం స్టార్ హీరోలు తపస్సు చేసినా దొరకిన పాత్రలు దక్కుతున్నాయి. బాహుబలి లాంటి పాత్ర దొరకడం అంటే మామూలు విషయం కాదు, ఆ తర్వాత రీసెంట్ గా శ్రీ రాముడి పాత్ర కూడా చేసాడు. ఈ పాత్రలకు ప్రభాస్ ని తప్ప వేరే హీరో ని ఊహించుకోలేము. సినిమా ఫలితాలు అనేవి కాసేపు పక్కన పెడితే, ఇప్పటికీ కూడా మన పురాణాలకు సంబంధించిన పాత్రలకు ప్రభాస్ ఒక్కడే ఛాయస్ గా మారాడు.
‘ఆదిపురుష్’ చిత్రం లో శ్రీ రాముడిగా కనిపించిన ప్రభాస్, ఇప్పుడు ‘ప్రాజెక్ట్ K ‘ చిత్రం లో మోడరన్ శ్రీ మహావిష్ణువు పాత్రలో కనిపించబోతున్నాడట. శ్రీ మహావిష్ణువు కలియుగం లో కల్కి అనే అవతారం ఎత్తుతాడు అని మన పురాణాల్లో సైతం చెప్పారు. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ K ‘ చిత్రం లో ఆయన ఆ పాత్రనే పోషించబోతున్నాడు అట.
మంచి మరియు చెడు కి జరిగే సంగ్రామం లో మోడరన్ విష్ణువు అవతారం ఎత్తిన ప్రభాస్, లేటెస్ట్ టెక్నాలజీ తో అతి భయంకరమైన సూపర్ విలన్స్ ని ఎలా ఎదురుకున్నాడు అనేదే స్టోరీ. ఇందులో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆగస్టు నెల నుండి ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ జారబోతుంది అని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం ఆయన 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ‘అశ్వద్ధామ’ గా నటించబోతున్నాడు, దీపికా పడుకొనే మరియు దిశా పఠాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ కి సంబంధించిన సన్నివేశాలు మినహా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యినట్టే అని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. ఈ జనరేషన్ లోనే బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.