ఫైనల్ గా తులసితో ఉన్న రిలేషన్ ను బయటపెట్టిన ప్రభాస్ శ్రీను

- Advertisement -

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఆడ, మగ ఇద్దరు సెలబ్రిటీలు కాస్త క్లోజ్ గా ఉంటే చాలు వారి మధ్య ఏదో నడుస్తుందని అనుమానించే రోజులు. ఇక గాసిప్ రాసే వాళ్ళు మాత్రం వారి చుట్టూ కథలు రాస్తూ ఒకటి క్రియేట్ చేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ఓ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ సీనియర్ క్యారెక్టర్ నటుడు క్లోజ్ గా ఉండడంతో రకరకాల చర్చలు వస్తున్నాయి. ఈ ప్రశ్న రావడానికి కారణం కూడా ఒక షో అదేంటంటే ఆలీతో సరదాగా.. ఈ షో కు చాలా మంది గెస్టులు వస్తూ ఉంటారు. ఒక్కోసారి కాంబినేషన్ గెస్ట్ లను కూడా పిలుస్తూ ఉంటాడు. అలా వచ్చి ఇరుకున పడ్డారు సీనియర్ నటిమణి తులసి, బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రభాస్ శీను.

ప్రభాస్ శ్రీను
ప్రభాస్ శ్రీను

ఆ షోలు ఇద్దరు శ్రుతి మించి పిలుచుకోవడంతో అందరూ వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఒకరినొకరు డార్లింగ్ అని పిలుచుకోవడం వంటి సన్నివేశాలు వల్ల ఈ కథనం మీడియాలోకి వచ్చింది. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కాకపోతే ఆ వైరల్ అయిన ఫోటోలు పై ప్రభాస్ శీను కానీ, తులసి గారు కానీ ఏనాడు కూడా అవి తప్పు అని ఖండించే ప్రయత్నం చెయ్యలేదు. అలాగని వివరణ కూడా ఇవ్వలేదు. దానితో ఈ వార్తలు నిజమేనా అని కొత్త సందేహాలు వచ్చాయి.

tulasi

దీనిపై తాజాగా ప్రభాస్ శ్రీను స్పందించాడు. ఆవిడతో నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ మా మీద చాలా వార్త పత్రికలు రూమర్స్‌ రాశాయి. ఆవిడ నాకు తల్లితో సమానం. ‘డార్లింగ్‌’ సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. ఆవిడ పెద్ద నటి ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు. ఏదో సరదాగా డార్లింగ్‌ అని పిలిచిందని.. చాలా అపార్థం చేసుకున్నారు. మా పై రూమర్స్‌ వచ్చినప్పుడు మొదట ఆవిడే నాకు మెసేజ్‌ పెట్టారు. ‘ఇలా రాశారు.. మీ భార్యకు చెప్పు లేదంటే తను కూడా ఆపార్థం చేసుకుంటుందేమోనని’ నా భార్య డాక్టర్‌. ఆ రూమర్స్‌ చూసి ఇద్దరం నవ్వుకుని వదిలేశాం. తులసి గారంటే నాకు చాలా గౌరవం. ఆవిడ ఎప్పుడూ పూజలకు సంబంధించిన మెసేజ్‌లే పెడుతుంటారు. అని చెప్పాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here