Spirit Movie : ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల తేదీ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్!

- Advertisement -

Spirit Movie : ప్రసుతం టాలీవుడ్ లో ఉన్న నేటి తరం స్టార్ హీరోలలో రికార్డ్స్ పరంగా కానీ, సినిమాలు చేసే సంఖ్య బలంలో కానీ ప్రభాస్ కి దరిదాపుల్లో ఎవ్వరూ లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన సినిమా మొదటి రోజు వచ్చే వసూళ్లు మిగిలిన స్టార్ హీరోల ఫుల్ రన్ వసూళ్లతో సమానంగా ఉంటుంది. హిట్/ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు దేశవ్యాప్తంగా వస్తున్నా వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘కల్కి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తూ ముందుకు దూసుకుపోతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మొదటి వారం లోనే ఈ చిత్రానికి 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

spirit movie

రెండు వారాలు పూర్తి అయ్యేసరికి ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుందని, ఫుల్ రన్ లో 1400 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నా మాట. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ సినిమాలు ఆరు నెలలకు ఒకటి విడుదల అవుతుండడం మరో విశేషం. మిగిలిన స్టార్ హీరోలు ఒక్కో సినిమా పూర్తి చెయ్యడానికి రెండు నుండి మూడు సంవత్సరాల సమయం తీసుకుంటుంటే, ప్రభాస్ సంవత్సరానికి రెండు సినిమాలు విడుదల చెయ్యడం వల్ల టాలీవుడ్ లాభాల బాట నడుస్తుంది. ఇప్పుడు ఆయన సందీప్ వంగ తో ‘స్పిరిట్’ అనే చిత్రం చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

- Advertisement -

Kalki 2898 AD | Prabhas's character in Kalki 2898 AD is called Bhairava; new poster out - Telegraph India

ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తో పాటు త్వరలోనే ఆయన హను రాఘవపూడి తో ఒక సినిమా చేయనున్నాడు. అలాగే అక్టోబర్ 23 వ తారీఖున రాజాసాబ్ టీజర్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. అలా ప్రభాస్ కి సంబంధించిన కొత్త సినిమాల అప్డేట్స్ తో ఆరోజు అభిమానులకు పండగే అని తెలుస్తుంది.

Official: Prabhas 25 titled Spirit! Sandeep Reddy Vanga to direct! "Telugu Movies, Music, Reviews and Latest News"

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here