Prabhas : వాళ్ళు లేకపోతే నేను సున్నా..’కల్కి’ 1000 కోట్ల గ్రాస్ పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Prabhas రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కల్కి’ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. రోజుకు ఒక మైలు రాయిని దాటుతూ, నేటితో ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుకి అతి చేరువగా వచ్చింది. సినిమా విడుదలై 17 రోజులు పూర్తి అయినా కూడా ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ ఫుల్ వసూళ్లతో నడుస్తున్నది. మొదటి వారం, మొదటి వీకెండ్ యూత్, మాస్ ఆడియన్స్ థియేటర్స్ వైపు దండయాత్ర చెయ్యగా. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ దండయాత్ర చేస్తున్నారు. పైగా భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలైన ఇండియన్ 2 చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో కల్కి చిత్రానికి మరింత బలం చేరుకుంది.

Kalki 2898 AD Crosses Coveted Rs 1000 Crore Mark At The Boxoffice | cinejosh.com

ఈ వసూళ్ల ప్రవాహం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ వారం లో మరో పబ్లిక్ హాలిడే కూడా ఉండడంతో ఫుల్ రన్ లో మరో వంద నుండి 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులు, అభిమానులకు కృతఙ్ఞతలు తెలియచేస్తూ ప్రభాస్ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

- Advertisement -

Kalki 2898 AD enters Rs 1,000 Cr club; Eyes all-time top 5 finish | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఆయన మాట్లాడుతూ ‘కల్కి చిత్రాన్ని ఇంతటి బ్లాక్ బస్టర్ ని చేసిన అభిమానులకు ముందుగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మీరు, మీ సపోర్ట్ సపోర్టు లేకపోతే నేను సున్నా. అలాగే ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకాలు పెట్టుకొని అశ్వినీదత్ గారు చాలా బడ్జెట్ పెట్టేసారు. నేనే భయపడి ఇప్పటికే చాలా అయ్యింది సార్, చూసుకోండి అనేవాడిని. కానీ ఆయన ఎం పర్వాలేదు, ఈ సినిమాతో మనం పెద్ద హిట్ కొట్టబోతున్నాం అని చెప్పి ఈ చిత్రాన్ని తీశారు. అలాగే ఆయన ఇండియాలోనే గ్రేట్ లెజెండ్స్ గా, చిన్నప్పటి నుండి మేమంతా చూస్తూ పెరిగిన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి వారితో కలిసి నటించే అదృష్టం కల్పించారు. అందుకు ధన్యవాదాలు’ అంటూ ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here