Prabhas : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెద్ద కుటుంబాలుగా పిలవబడే వారిలో మంచు మోహన్ బాబు కుటుంబం కూడా ఒకటి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మోహన్ బాబు , తొలుత చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ, ఆ తర్వాత విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి, ఆ తర్వాత హీరో గా కూడా ఎన్నో హిట్లు, బ్లాక్ బూస్టర్లు మరియు ఇండస్ట్రీ హిట్లు అందుకున్నాడు.

కానీ ఇప్పుడు మాత్రం ఆ కుటుంబానికి టాలీవుడ్ లో పూర్తిగా మార్కెట్ పోయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జనాలు వీళ్ళ సినిమాని థియేటర్స్ లో చూడడం ఆపేసారు, అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్యామిలీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి తెగ ట్రై చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే వంద కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ అనే చిత్రం రీసెంట్ గానే ప్రారంభం అయ్యింది.

ఈ సినిమాకి నిర్మాత మోహన్ బాబు వంద కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాడు అని మొదటి నుండి ఇండస్ట్రీ లో టాక్ ఉండేది. అది నిజమే అని మంచి విష్ణు రీసెంట్ గానే ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేసాడు. ఇందులో ఆయన మహా శివుడి పాత్రని పోషించబోతున్నాడట. ఆ పాత్ర సుమారుగా పది నిమిషాల పాటు ఈ చిత్రం లో ఉంటుంది. ప్రభాస్ ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటాడు.

కానీ ఈ ‘కన్నప్ప’ చిత్రం కోసం ఆయన ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదట. కారణం మంచు కుటుంబంతో ఆయనకీ ఉన్న రిలేషన్ అని తెలుస్తుంది. మంచు మోహన్ బాబు తో కలిసి ప్రభాస్ ‘బుజ్జిగాడు’ అనే చిత్రం చేసాడు. అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య రిలేషన్ తండ్రి కొడుకుల రేంజ్ లో ఉంటుంది, మంచు విష్ణు కూడా ప్రభాస్ కి మంచి స్నేహితుడు. అందుకే ఈ సినిమా ఉచితంగా చెయ్యడానికి ఒప్పుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఈ సినిమా రేంజ్ మరో లెవెల్ కి వెళ్ళిపోయింది అనే చెప్పాలి.