Raja Saab : ప్రభాస్ ‘రాజా సాబ్’ టీజర్ గురించి సెన్సేషనల్ అప్డేట్..ఫ్యాన్స్ కి ఇక పండగే!

- Advertisement -

Raja Saab రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ చిత్రం మ్యానియా ఇంకా థియేటర్స్ లో నడుస్తూనే ఉంది. విడుదలైన ప్రతీ థియేటర్ లో ఈ చిత్రం 50 రోజులు రన్ అయ్యే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , ఈ వీకెండ్ తో 1100 కోట్ల రూపాయిల మార్కుని కూడా దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా సునామీ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహపరిచే అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వం లో ‘రాజా సాబ్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది.

Raja Saab
Raja Saab

వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కి సంబంధించిన గ్లిమ్స్ వీడియో రేపు విడుదల చెయ్యనున్నారు. ఫ్యాన్ ఇండియా అనే పేరుతో ఈ వీడియో రేపు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్. మిర్చి చిత్రం తర్వాత ప్రభాస్ నుండి అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే వచ్చాయి. దీంతో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ తెలుగు సినిమా చేసి ప్రభాస్ చాలా కాలం అయ్యింది, మళ్ళీ మా వింటేజ్ ప్రభాస్ ని ఎప్పుడు చూస్తాము అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ లో చిన్నపాటి నిరుత్సాహం ఉండేది.

Time locked for The Raja Saab's 'Fan India Glimpse' | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

- Advertisement -

ఆ నిరుత్సాహం మరిచిపోయే విధంగా, మిర్చి స్థాయి పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ‘రాజా సాబ్’ ఉండబోతుంది. ఈ చిత్రం లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు, ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. ఈ సంక్రాంతికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రాలతో పాటుగా ఇప్పుడు రాజా సాబ్ కూడా విడుదల కాబోతుంది. రేపు విడుదల అవ్వబోయే గ్లిమ్స్ వీడియో లో విడుదల తేదీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Amid Kalki 2898 AD Storm, Makers Of Prabhas' The Raja Saab All Set To Deliver 'Thunderbolts'

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here