Prabhas : ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’.. కటౌట్స్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్స్.. డార్లింగ్ డైలాగ్స్ అదుర్స్..

- Advertisement -

Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు… రీసెంట్ గా ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. నాగీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది.. 5 రోజులకు ఏకంగా 700 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ బ్రేక్ చేస్తుంది.. ఇంకా కలెక్షన్స్ ఊచకోత కొనసాగుతుంది.. ఇదిలా ఉండగా.. డార్లింగ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అదిరిపోయిన డైలాగులు ఏంటో ఓ లుక్ వేద్దామా..

మిర్చి..

మిర్చి సినిమాలో ప్రభాస్ మాస్ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే ఎవరు వాడలేరు.. అలాగే ఈ సినిమా మొత్తం ఊరమాస్ డైలాగులు వినిపిస్తాయి.. ఇవన్నీ కూడా ప్రభాస్ ను మాస్ హీరోగా చేశాయి..

- Advertisement -

బాహుబలి..

బాహుబలిలో రాజమౌళి ప్రభాస్ ను చూపించిన తీరు యావత్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.. ఒక్క డైలాగు అని కాదు ప్రతి డైలాగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇక పార్ట్ 2 లో కూడా డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చేసాయి.. దాంతో రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా మంచి టాక్ ను అందుకున్నాయి..

సాహో..

సుజిత్, ప్రభాస్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ మూవీ సాహో.. సినిమా మొత్తం భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి.. చివరికి అతనే అన్నిటికి కింగ్ అని చెప్పిన సీన్లు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి.. సినిమా హిట్ టాక్ ను అందుకోలేదు కానీ యాక్షన్ సీన్స్ బాగా నచ్చేసాయి..

సలార్..

ఇక ఈ సినిమా గురించి చెప్పనక్కర్లేదు.. గత ఏడాది వచ్చింది… ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ సినిమాలో మాస్, యాక్షన్ డైలాగులు జనాలను ఎంతగా ఆకట్టుకున్నాయో సినిమా రిజల్ట్ చూస్తేనే తెలుస్తుంది..

 

కల్కి..

రీసెంట్ గా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ సినిమా మేనియా ప్రపంచం వ్యాప్తంగా కొనసాగుతుంది.. ఈ సినిమా లో బౌంటి హంటర్ గా కనిపించిన చివరికి కర్ణుడి పాత్రలో కనిపించాడు.. ఆలస్యమైందా ఆచార్య పుత్ర అనే డైలాగు చెబుతూ రథం పై నిలబడితే థియేటర్లు దద్దరిల్లి పోయాయి.. అందుకు సినిమా 1000 కోట్ల వైపు పరుగులు పెడుతుంది.. త్వరలోనే పార్ట్ 2 కూడా రాబోతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here