Prabhas : రాముడిగా ప్రభాస్ ని చూసేందుకు ఆదిపురుష్ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేశారు. కాగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా మూవీ రిజల్ట్ ఏంటో అందరికీ తెల్సిందే. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఓంరౌత్ తెరకెక్కించిన మూవీ బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. విజువల్ వండర్ గా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందనకున్న సినిమా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆదిపురుష్ మూవీపైనా జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు.
పాన్ ఇండియా మూవీపై ఆ రేంజ్ లో ట్రోలింగ్ జరగడం కూడా అదే ఫస్ట్ టైం. ఇక డైలాగులపై వచ్చి నెగిటివిటీ గురించి చెప్పాల్సిన పని లేదు. అభ్యంతకర డైలాగులు రాశాడని రైటర్ మనోజ్ ముంతీషర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియాలో మనోజ్ పై జరిగిన ట్రోలింగ్ ను ఆయనే తట్టుకోలేకపోయాడు. పర్సనల్ అటాకింగ్ భరించలేకపోయాడు. ఓ డైలాగ్ పై దిగొచ్చి.. ఏకంగా క్షమాపణలు కోరాడు. కొన్ని విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఇది మనోజ్ ను తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ట్రోలింగ్ గురించి అందరికీ తెల్సిన విషయమే. కానీ పర్సనల్ అటాకింట్ తట్టుకోలేక ఈ రైటర్ విదేశాలకు పారిపోయాడన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేసాడు. ఆదిపురుష్ రిలీజ్ తర్వాత విమర్శలపై స్పందించి తప్పు చేశానని ఒప్పుకున్నాడు మనోజ్. అప్పటికే జనాలు పీకల వరకూ కోపంగా ఉన్నారని.. ఓపికగా ఉండాల్సిందన్నాడు ఈ రైటర్.
చంపుతారని బెదిరింపులు వచ్చేసరికి విదేశాలకు పారిపోయినట్లు స్పష్టం చేశాడు. కాంట్రవర్సీ చల్లారేవరకు విదేశాల్లోనే ఉన్నట్లు తెలిపాడు. ఆదిపురుష్ మూవీకి పని చేసి తప్పుచేసినట్లు ఫారెన్ లో ఉన్నప్పుడు అన్పించిందన్నాడు. ప్రపంచం తనను ఎలా చూసినా.. తన కుటుంబానికి తాను మాత్రం హీరోనే అని అన్నాడు. ఆదిపురుష్ వివాదం నుంచి చాలా విషయాలు తెల్సుకున్నట్లు.. ఇకపై జాగ్రత్తగా ఉంటానని తెలిపాడు మనోజ్ ముంతషీర్. మరోవైపు తాను సెకండ్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు స్పష్టం చేశాడు.