Kalki 2898 AD : ప్రభాస్ నటించిన ‘సాలార్’ చిత్రం ఇటీవల విడుదలైంది. అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఓటీటీలో ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉందంటే.. భారీ డిమాండ్ కారణంగా దీనిని ఇంగ్లీష్ లో కూడా డబ్ చేయాల్సి వచ్చింది. ప్రభాస్ గత కొంత కాలంగా వరుసగా ఫ్లాప్ లు ఎదురొంటూనే ఉన్నాడు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూ వస్తుంది. ‘సాలార్’ బాక్సాఫీస్ గేమ్‌లో అతనికి కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ‘కల్కి 2898AD’తో రాబోతున్నాడు. ముందుగా పొంగల్‌కు విడుదల చేయాలనుకున్నప్పటికీ వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.

సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని కొత్త విడుదల తేదీ ఇంకా వెల్లడి కాలేదు. అయితే రోజుకో కొత్త అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కొత్త సమాచారాన్ని షేర్ చేశారు. సినిమా పరిశ్రమకు ప్రభాస్ పెద్ద చోదక శక్తి అని ఆయన అన్నారు. అందుచేత ఆయన కోసం కొన్ని ప్రత్యేకమైన సంగీతం ఉండాలి. ఇందులోభాగంగా మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాస్ ఇంట్రో బిజిఎమ్ని మళ్లీ సృష్టిస్తున్నారు.. లేదా దానిలో కొన్ని మార్పులు చెయొచ్చని తెలుస్తోంది.

సంతోష్ మాట్లాడుతూ.. ‘‘నేను మళ్లీ ప్రభాస్ సర్ ఇంట్రోపై పని చేస్తున్నాను. నేను అతని కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాను. ఇది పెద్ద సినిమా.. భారీగా ఉండాలి. ‘కల్కి’లో ప్రభాస్ చాలా పవర్ఫుల్ ఇంట్రడక్షన్‌ను చూపించబోతున్నారని ఆయన సూచించారు. దీని ట్రైలర్ ఇంకా రావాల్సి ఉంది. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. వీఎఫ్ఎక్స్కు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే పలువురు తారలు గెస్టులుగా రాబోతున్నారు. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జూనియర్ ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి పేర్లు జాబితాలో ఉన్నాయి.