Prabhas : ఇటీవలే ప్రభాస్ సలార్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. తర్వాత వరుస లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. అయితే ప్రభాస్ కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. అది కూడా ఆరోగ్యం, తన బాడీ మీద ఫోకస్ చేయడానికే అని సమాచారం.

ప్రభాస్ ఇటీవలే కల్కి షూటింగ్ పూర్తిచేసేసాడు. రాజాసాబ్ మిగిలిన షూట్ త్వరలో మొదలవుతుంది. అయితే ఇటీవల ప్రభాస్ చాలా మారిపోయాడని, ఫేస్ లో కూడా చాలా ఛేంజెస్ వచ్చాయని, బాడీ కూడా ఫిట్ గా లేదని కామెంట్స్ వచ్చాయి. అలాగే ఇటీవల ప్రభాస్ కి మోకాలి సర్జరీ కూడా జరిగింది. దీంతో కొన్ని రోజులు సినిమా షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకొని తన ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు ప్రభాస్.

సమ్మర్ లో రాజా సాబ్ సినిమా షూట్ మొదలవుతుందని అప్పటి వరకు ప్రభాస్ కనీసం ఓ మూడు నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ మోడ్ లో ఉంటాడని సమాచారం. రాజాసాబ్ తర్వాత సందీప్ వంగ, సలార్ 2 సినిమాలు రెండూ కూడా వచ్చే సంవత్సరం లేదా ఈ సంవత్సరం చివర్లో మొదలవ్వనున్నాయి. ఇటీవల సమంత కూడా తన హెల్త్ మీద ఫోకస్ చేయడానికి సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.