Prabhas : ఏ హీరోకు సాధ్యం కాని రేర్ రికార్డును సెట్ చేసిన ప్రభాస్.. వరుసగా ఐదు సార్లు

- Advertisement -

Prabhas : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఎట్టకేలకు జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన కల్కి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కల్కి మూవీ మొదటి రోజు ఏకంగా రూ .191 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే కల్కి చిత్రం షారూఖ్ ఖాన్ జవాన్ సినిమాను అధిగమించి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్ డే సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.

Prabhas
Prabhas

నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ నిర్మించారు. దాదాపు రూ.600కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఇది ఇలా ఉంటే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత తాను చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల అవుతున్నాయి. పాన్ ఇండియా హీరోగా పిలిపించుకున్న మొదటి స్టార్ ప్రభాసే. బాహుబలి 2 నుంచి ప్రభాస్ వరల్డ్ వైడ్ స్టార్ డమ్ తెచ్చుకోవడమే కాకుండా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు కలెక్షన్స్ భారీగా వస్తాయని ఫిక్స్ అయిపోయారు. సినిమా టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ డే ఈజీగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే తన సినిమాలతో అనేక రికార్డులు క్రియేట్ చేసిన ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో కొత్త రికార్డును సెట్ చేశాడు.

Prabhas
Prabhas

ఇండియాలో ఏ స్టార్ హీరో సాధించలేని రేర్ రికార్డు డార్లింగ్ సాధించాడు. ఓపెనింగ్ రోజు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఏకంగా 5 సినిమాలతో సాధించి చరిత్ర సృష్టించాడు. ఏ బాలీవుడ్ హీరోకి కూడా ఓపెనింగ్ రోజు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఇన్ని లేవు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలతో మొదటి రోజు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశాడు. బాహుబలి 2 సినిమా మొదటి రోజు 217 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సాహో మొదటి రోజు రూ.130 కోట్ల కలెక్షన్స్, ఆదిపురుష్ మొదటి రోజు రూ.140 కోట్లు, సలార్ రూ.178 కోట్లు మొదటి రోజు వసూలు చేశాయి. నిన్న రిలీజయిన కల్కి సినిమా మొదటి రోజు రూ.191.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here