Actor Prabhas మన తెలుగు సినిమాని ఇప్పుడు టాలీవుడ్ అనే దానికంటే ‘ప్రభాస్ వుడ్’ అని పిలవడం సమంజసం గా ఉంటుందేమో. ఎందుకంటే దేశంలో ఏ సూపర్ స్టార్ కి కూడా సాధ్యం కానటువంటి వసూళ్లను ఆయన ఫ్లాప్ టాక్ తో పెట్టాడు, అలాగే హిట్ టాక్ తో కూడా పెట్టాడు. ఆయన హీరో గా నటించిన ఆదిపురుష్ చిత్రానికి ఏ స్థాయి డిజాస్టర్ టాక్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ఆ చిత్రానికి సుమారుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రీసెంట్ గా విడుదలైన కల్కి చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది. భారతదేశంలో షారుఖ్ ఖాన్ తర్వాత రెండు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాలు ఉన్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే.
టాలీవుడ్ నుండి మూడు సినిమాలు వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటే, అందులో రెండు ప్రభాస్ వి. ఇక టాలీవుడ్ ని ‘ప్రభాస్ వుడ్’ అని అనకుండా ఎలా ఉండగలం చెప్పండి. అంతే కాకుండా మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే ప్రభాస్ అత్యధిక సినిమాలు చేస్తూ ట్రేడ్ ని బ్రతికిస్తున్నాడు. ఇది కూడా ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. ఒక్కో స్టార్ హీరో మూడేళ్లకు ఒక సినిమా విడుదల చేస్తున్న ఈరోజుల్లో ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రాజా సాబ్, సలార్ 2 , కల్కి 2 , స్పిరిట్ మరియు హను రాఘవపూడి చిత్రాలు ఉన్నాయి.
రాజా సాబ్ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల అవుతుందని రీసెంట్ గా విడుదలైన టీజర్ తో మూవీ టీం తెలిపింది. ఈ చిత్రం తో పాటుగా ఆయన హను రాఘవపూడి తో కూడా ఒక సినిమా చేయనున్నాడు. హిస్టరీ లో మర్చిపోలేని అరాచకాలలో ఒకటి రాజాజార్ సంఘటన. ఆ సంఘటన జరిగిన సమయానికి సంబంధించిన స్టోరీ ఇది. ఇందులో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే సందర్భానికి తగ్గట్టుగా ఈ చిత్రం లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా కనిపిస్తాడట. ఆ పాత్ర కూడా ప్రభాస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరులో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మొదటి షెడ్యూల్ కోసం ప్రభాస్ ఇప్పటికే 15 రోజుల కాల్ షీట్స్ కేటాయించాడట.