ఈమధ్య కాలం లో టాక్ బాగాలేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద కనీస స్థాయి వసూళ్లు కూడా లేక వారం రోజుల లోపే థియేటర్స్ నుండి వెళ్ళిపొయ్యే పరిస్థితి వచ్చింది. ఎంత పేరున్న హీరోకి అయినా ఇది తప్పట్లేదు.కరోనా లాక్ డౌన్ తర్వాత జరిగిన పెను మార్పులలో ఇది ఒకటి, కానీ సినిమా బాగుంటే మాత్రం ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తున్నారు. అయితే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వీటి అన్నిటికీ అతీతం అని చెప్పాలి.

రీసెంట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’, అంతకు ముందు విడుదువులైన ‘రాధేశ్యామ్’ మరియు ‘సాహూ’ చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా సాహూ చిత్రం వసూళ్లను అయితే ప్రస్తుతం మన టాలీవుడ్ పాన్ ఇండియన్ మార్కెట్ తెచ్చుకున్న స్టార్ హీరోలు సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని కూడా బ్రేక్ చేయలేకపోయారు, దీనిని బట్టి ప్రభాస్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఇక లేటెస్ట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రానికి కూడా మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ వచ్చింది. ఎలాంటి టాక్ అంటే, రామాయణం ని అపహాస్యం చేసేసారు అనే రేంజ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి మూడు రోజుల్లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు, 160 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మన టాలీవుడ్ లో ఒక్క ప్రభాస్ కి కాకుండా అల్లు అర్జున్ కి మినహా, మిగతా హీరోలెవ్వరికీ కూడా 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన సినిమాలు లేవు.

మహేష్ బాబు కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ 210 కోట్ల రూపాయిల గ్రాస్ కాగా, పవన్ కళ్యాణ్ కెరీర్ హైయెస్ట్ కలెక్టన్స్ 170 కోట్ల రూపాయిలు. ఇక రామ్ చరణ్ కెరీర్ హైయెస్ట్ 240 కోట్ల రూపాయిల గ్రాస్ కాగా, ఎన్టీఆర్ కెరీర్ హైయెస్ట్ క్రాస్ 142 కోట్ల రూపాయిల మాత్రమే. ఈ లెక్కన చూసుకుంటే కేవలం మూడు రోజుల్లోనే టాలీవుడ్ స్టార్ హీరోల కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ని ప్రభాస్ ఆదిపురుష్ ఒక్క దెబ్బతో దాటేసినట్టే కదా అని అంటున్నారు ట్రేడ్ పండితులు.