Prabhas : సహాయం చేసే గుణం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి మించినోడు ఎవ్వరూ లేరని అంటుంటారు. రీసెంట్ గా ఆయన చేసిన మహోన్నత పని చూస్తే అది నిజమే అని అనిపించక తప్పదు. జనవరి 22 వ తారీఖున అయోధ్య లో జరగబోయే రామ మందిరం ప్రారంభోత్సవానికి కోట్లాది మంది ప్రజలు ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారో మన అందరికీ తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ వేడుకకు దేశం నలుమూలల నుండి రామ భక్తులు లక్షలాదిగా తరళి రాబోతున్నారు.
ఈ సందర్భంగా ప్రభాస్ అక్కడికి వచ్చే భక్తులకు ఆహరం ఏర్పాటు చెయ్యడానికి 50 కోట్ల రూపాయిలను విరాళం గా ఇవ్వబోతున్నాడు. ఈ సంగతి తెలుసుకొని ప్రభాస్ అభిమానులతో పాటుగా ఇతర హీరోలు అభిమానులు కూడా ప్రభాస్ కి చేతులెత్తి మొక్కుతున్నారు. తన ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా భోజనం పెట్టి పంపడం ప్రభాస్ కి ఉన్న మంచి అలవాటు.
ఈ అలవాటు ఆయనకీ తన పెదనాన్న కృష్ణం రాజు నుండి వచ్చింది. శత్రువైనా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపాలి అనేది కృష్ణం రాజు సిద్ధాంతం. దానిని ప్రభాస్ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాడు. పెదనాన్న కృష్ణం రాజు చనిపోయిన తర్వాత దినం భోజనాలకు ఎన్ని మొగళ్తూరు మొత్తాన్ని పిలిచి రకరకాల వంటకాలను తినిపించాడు. ఇప్పుడు కూడా అదే చెయ్యబోతున్నాడు. గత ఏడాది ఆయన ‘ఆదిపురుష్’ చిత్రం లో శ్రీరాముడిగా నటించిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ ఓం రౌత్ పుణ్యమా అని శ్రీ రాముడి భక్తుల్లో ప్రభాస్ కాస్త నెగటివిటీ ని పెంచుకున్నాడు. ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమ తో తిరిగి వాళ్ళ మనస్సులో స్థానం సంపాదించుకోబోతున్నాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ప్రస్తుతం ‘సలార్’ సక్సెస్ ని మంచిగా ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్, మే 9 వ తారీఖున ‘కల్కి’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.