Nithya Menon : ఆ స్టార్ డైరెక్టర్ చేసిన పనితో తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిన నిత్యామీనన్

- Advertisement -


Nithya Menon పరిచయం అక్కర్లేని పేరు. తాను పేరుకి మలయాళ కుట్టీ అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. సినిమా ఇండస్ట్రీలో తన గాత్రంతో, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిత్యామీనన్ తెలుగులో నానితో కలిసి అలా మొదలైంది అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీలో సడన్ గా సినిమాలు చేయడం ఆపేసింది. దానికి కారణం ఒక బడా డైరెక్టర్ అంటూ వార్తలు వినిపిస్తు్న్నాయి.

Nithya Menon
Nithya Menon

ఆ బడా దర్శకుడు ఆమెకు కథ చెప్పే ముందు ఒకలా.. తెరకెక్కించే ముందు మరొకలా సీన్స్ క్రియేట్ చేశారట. ఎడిటింగ్ లో ఆమెకు సంబంధించిన సీన్స్ అన్నీ లేపేశారట. దీంతో ఆ సినిమా హిట్ అయినా సరే నిత్యామీనన్ కి పేరు రాలేదు. ఈ కారణంగానే నిత్యామీనన్ ఆ డైరెక్టర్ పై గుర్రుగా ఉండడంతో తెలుగు సినిమాలను ఒప్పుకోవడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Nithya Menon Updates

అయితే నిత్యామీనన్ హైట్ తక్కువ కావడంతో అందరి హీరోలకు సూట్ అవ్వదని.. దాంతో ఆమెను చాలా మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తున్నారు అని.. ఆ కారణంగానే ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయని మరికొందరు బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ.. మొత్తానికి నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here