రచయితగా ,దర్శకుడిగా మరియు నటుడిగా పోసాని కృష్ణ మురళి కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక మంచి గుర్తింపు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ ఈయన కమెడియన్ గానే ఎక్కువ పాపులారిటీ ని సంపాదించాడు. తనదైన మ్యానరిజమ్స్ మరియు బాడీ లాంగ్వేజ్ తో పాటు, డిఫరెంట్ డైలాగ్ డెలివరీ మరియు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం పోసాని కృష్ణ మురళి స్పెషాలిటీ.

అంతే కాదు ఆయన కెరీర్ లో ‘టెంపర్’ సినిమాలోని మూర్తి లాంటి పాత్రలు కూడా ఎన్నో ఉన్నాయి.కేవలం సినీ రంగం లో మాత్రమే కాదు, రాజకీయ రంగం లో కూడా ఆయన తన మార్క్ ని ఏర్పర్చుకున్నాడు.మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తో మొదలైన పోసాని రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం వైసీపీ పార్టీ తో కొనసాగుతుంది.ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని పంచుకున్నాడు.

పోసాని కృష్ణ మురళి గురించి అందరికీ తెలుసు కానీ, ఆయన పిల్లల గురించి మరియు భార్య గురించి మాత్రం ఎవరికీ తెలియదు.ఎందుకంటే ఆయన ఎవరికీ చెప్పలేదు కూడా.అయితే రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో మాత్రం తన ఇద్దరి కొడుకుల గురించి చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘నాకు ఉజ్వల్ మరియు ప్రజ్వల్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు, పెద్ద కొడుకు ఉజ్వల్ డిగ్రీ చేసిన తర్వాత హాంకాంగ్ కి ఫిలిం ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి నటన , డైరెక్షన్ , రైటింగ్ ఇలా అన్నీ నేర్చుకున్నాడు.ఆ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత హంగేరికి వెళ్తాను అని చెప్పాడు.అక్కడ మాస్టర్స్ చెయ్యాలనుకున్నాడు , కానీ అక్కడి వాతావరణం వాడికి సరిపడక ఆరోగ్యం చెడిపోయింది,మళ్ళీ అటు వైపు పోలేదు.
అయితే నాకొడుకు అని చెప్పుకోవడం కాదు కానీ , ఉజ్వల్ నాకంటే పది రెట్లు మెరుగైన కథలు రాయగలడు, నాకంటే అద్భుతమంగా డైలాగ్స్ చెప్పగలడు.ఇక్కడి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా స్థిరపడడానికి వచ్చాడు కానీ, వాడికి ఇక్కడి పద్ధతులు నచ్చలేదు, అయితే వాడు రాసుకున్న ఒక కథని నాకు ఇచ్చాడు, ఆ కథతోనే ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను.యూజవల్ హాంకాంగ్ లో ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్సులు అయిపోయాక కొన్ని హాలీవుడ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు’ అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చాడు.