Posani Krishna Murali : తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు , ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. టాలీవుడ్ లో కమెడియన్ గా పోసాని కృష్ణ మురళి కూడా నటనపరంగా బాగానే పేరు సంపాదించారు. ప్రస్తుతం APFDC చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్ సీఎంను పట్టుకొని బాలయ్య సైకో అంటూ మాట్లాడిన వ్యాఖ్యలపై తాజాగా పోసాని కృష్ణ మురళి ఘాటుగా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ సైకోనా లేక బాలకృష్ణ సైకోనా అనే విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటూ ఘాటు కౌంటర్ వేశారు..
బాలయ్య తుపాకీతో ఇద్దరిని కాల్చారని ఇలా మంచోళ్ళు కాలుస్తారా? లేక సైకోలు కాలుస్తారా? అంటూ విమర్శించడం జరిగింది. మనకు చట్టం, న్యాయం ఉన్నాయని. ఏవైనా సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూసుకోవాలి కానీ ఇలా తుపాకీతో కాదు కదా అంటూ తెలియజేశారు. పోనీ కాల్చిన తర్వాత ఒక్కరోజైనా జైలులో ఉన్నాడా అంటూ ప్రశ్నించారు.. అదే మనలాంటి వాళ్లు కాలిస్తే అమాయకుడని చెప్పినా కూడా వదలరు కొట్టి జైల్లో పెడతారు.. కానీ బాలకృష్ణ ఇద్దరిని కాల్చాడని ఎవరు ఏమి చేయలేకపోయారని తెలిపారు..
ఎవరు అసమర్థుడు ?ఎవరు క్రూరుడు? ఎవరికి మానసిక అనారోగ్య సమస్యలు అంటూ తెలియజేశారు.. ఇదంతా వదిలేస్తే ఇక బాలకృష్ణ ఇంట్లోనే ఆయన కళ్ళముందే ఆయన ఇంటి వాచ్మెన్ మరణిస్తే తెల్లారి మేకప్ వేసుకొని మృతదేహాన్ని దాటుకొని మరీ షూటింగ్ కి వెళ్ళారంటూ వ్యాఖ్యానించారు
ఎవరైనా ఇలా చేస్తారా.. ఇప్పుడు చెప్పండి.. ఎవరు సైకో.. జగనా లేకపోతే బాలయ్యనా అంటూ ప్రశ్నించుకోవాలని తెలియజేశారు.. ఏదైనా ఫంక్షన్ లో ఆడవాళ్లు కనిపిస్తే చాలు బాలయ్య కడుపు చేయాలి అంటూ నీచంగా మాట్లాడారు. ఇలాంటి నీచమైన పదాలు అసలు జగన్ గారు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు.. ఇలాంటివి మాట్లాడితే చాలానే ఉన్నాయని బాలయ్య పైన సెటైర్లు వేశారు పోసాని.