Poonam Pandey : ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే నిన్న చనిపోయింది అంటూ వచ్చిన వార్త యావత్తు సినీ ప్రపంచాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ఎంతో చలాకీగా కనిపించే పూనమ్ పాండే చాలా కాలం నుండి సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉందని, అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడం తో ఆమె చనిపోయిందని ఆమె మ్యానేజర్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియచేసాడు. రెండు రోజుల క్రితం కూడా పూనమ్ పాండే తనకి సంబంధించిన వీడియోస్ ని, ఇంస్టాగ్రామ్ రీల్స్ ని అప్లోడ్ చేసింది.

అంతే కాకుండా శ్రీ రామ మందిరం ప్రారంభోత్సవం నాడు ఆమె ఎంతో చలాకీగా కనిపించి కేరింతలు కొట్టింది. ఆమెని చూస్తే ఏ యాంగిల్ లో కూడా క్యాన్సర్ తో బాధపడుతున్న మనిషిగా కనిపించదు. అలాంటి అమ్మాయికి క్యాన్సర్ రావడం ఏమిటి అని ఆమె అభిమానులు వాపోతున్నారు. అయితే ఈ సందర్భంగా పూనమ్ పాండే కి 11 ఏళ్ళు బాడీ గార్డ్ గా పని చేసిన అమీన్ ఖాన్ రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పూనమ్ పాండే చనిపోయింది అంటే నేను నమ్మలేక ఉన్నాను. ఆమెతో కలిసి నేను ఎన్నో ఏళ్ళు పని చేశాను, రెండు రోజుల క్రితం కూడా ఒక మాల్ లో ఆమెని నేను కలిసాను. పూనమ్ ఎలా ఉంటుంది, ఏమి చేస్తుంది అనేది నాకు ప్రతీ ఒక్కటి తెలుసు. రెండు రోజుల క్రితం నేను ఆమెని కలిసినప్పుడు కూడా ఆమె చాలా ఆరోగ్యంగా ఉండింది. ఆమెకి అసలు జబ్బు ఉన్నట్టు నేను ఇప్పటి వరకు వినలేదు. అందరి లాగానే నేను కూడా సోషల్ మీడియా లోనే ఆమె మరణ వార్త విన్నాను. వెంటనే ఆమె సోదరి కి ఫోన్ చేసి అసలు నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేశాను. కానీ ఆమె నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చెయ్యడం లేదు. ఆమె రిప్లై కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, నిజంగా చనిపొయ్యుంటే పూనమ్ కుటుంబ సభ్యులు ఈపాటికి మీడియా కి తెలిపేవారు కదా?, ఎందుకు తెలపలేదు?, అందుకే పూనమ్ పాండే బ్రతికే ఉందనే నమ్మకం నాకు ఉంది, ఎక్కడో ఎదో పొరపాటు జరిగింది’ అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
