Bigg Boss Amardeep : హీరోగా రెమ్యూనరేషన్ విషయం లో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న అమర్ దీప్..ఎంత అడుగుతున్నాడో తెలుసా!

- Advertisement -

Bigg Boss Amardeep : హీరోగా రెమ్యూనరేషన్ విషయం లో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న అమర్ దీప్..ఎంత అడుగుతున్నాడో తెలుసా!’జానకి కలగనలేదు’ అనే బ్లాక్ బస్టర్ టీవీ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న అమర్ దీప్, ఆ సీరియల్ ఇచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఈ సీజన్ లో అసలు మాస్క్ అనేది లేకుండా కెమెరాలు చూస్తున్నాయి అనే జాగ్రత్త లేకుండా, ఎలా అయితే ఉండాలి అనుకున్నాడో, అలా ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఇతనే.

అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని పంచి ఈ షో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకడిగా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే తన మీద జరిగిన నెగటివిటీ ని చూసి కాస్త బాదపడినప్పటికీ, ఆ తర్వాత మామూలు అయ్యి తన పనుల్లో బిజీ అయ్యాడు. ఇటీవలే ఆయన హీరో గా ఒక సినిమాని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు కూడా మొదలు అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీతా నటిస్తుంది. ఇది వరకే అమర్ దీప్ ‘అభిలాష’, ‘ఐరావతం’ వంటి సినిమాల్లో హీరో గా నటించాడు కానీ, అవి ఎందుకో పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాలేదు. దీంతో ఈ చిత్రం తో ఎలా అయినా సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ లో స్థిరపడాలి అని అనుకుంటున్నాడు. అయితే ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాకి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకొని ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

ఇండస్ట్రీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కి ఆయన ఏకంగా కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడట. అమర్ దీప్ కి ప్రస్తుతం అంత రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ ఫేమ్ రాలేదు , అయ్యినప్పటికీ కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చెయ్యడం ఇప్పుడు చర్చనీయాశం అయ్యింది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ కచ్చితంగా ఈ సినిమా ఓపెనింగ్స్ కి ఉపయోగపడుతుంది అని బలంగా నమ్ముతున్నాడు అమర్ దీప్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here