పాన్ ఇండియన్ లెవెల్ లో మంచి క్రేజ్ మరియు గుర్తింపుని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే. ఒక లైలా కోసం అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార, ఆ సినిమా హిట్ అవ్వడం తో అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, సక్సెస్ లు మాత్రం వచ్చేవి కాదు. అప్పుడు ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టి హ్రితిక్ రోషన్ తో ‘మోహెన్ జోడారో’ అనే చిత్రం చేసింది.
ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది అప్పట్లో. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పూజా హెగ్డే, మళ్ళీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజిగా ఆడినప్పటికీ పూజ హెగ్డే హాట్ అందాలకు అందరూ ఫిదా అయిపోయారు.
ఇక ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి,కానీ ఈమధ్య ఈమె చేసిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో పూజ హెగ్డే తో సినిమాలు చెయ్యడానికి భయపడుతున్నారు దర్శక నిర్మాతలు.దానికి తోడు ఈమెని ఈమధ్యనే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం షూటింగ్ లో తనకంటే ఎక్కువ ప్రాముఖ్యత నిన్నగాక మొన్న వచ్చిన శ్రీలీల కి ఇస్తున్నారనే కోపం తో డైరెక్టర్ త్రివిక్రమ్ పై పెదవి విరిచి సినిమా నుండి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తన దగ్గరకి వచ్చిన దర్సకనిర్మాతలతో చాలా యాటిట్యూడ్ తో మాట్లాడడం కూడా ఈమెకి అవకాశాలు కోల్పోయేలా చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో ఈమెకి ఒక హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. కానీ రెమ్యూనరేషన్ ఆమె ఇంతకు ముందు మార్కెట్ కి తగ్గట్టుగా నాలుగు కోట్ల రూపాయిలు డిమాండ్ చేసిందట. నిర్మాతలు అంత ఇచ్చుకోలేము, కేవలం 75 లక్షలు మాత్రమే ఇస్తాము అనడం తో ఈమె కాస్త యాటిట్యూడ్ చూపుతూ నేను చెయ్యను అని మొహమాటం లేకుండానే చెప్పిందట. అలా ఆమె యాటిట్యూడ్ చూపిస్తే బంగారం లాంటి సినీ కెరీర్ ని నాశనం చేసుకుంటుంది అని అంటున్నారు విశ్లేషకులు.