చిన్న హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమై తర్వాత అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు జన్మించిన పూజా హెగ్డే చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. అందుకే మోడలింగ్ లో రాణించిన తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు మూడు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ తర్వాత గ్లామర్ డోస్ పెంచి యూత్ ను అట్రాక్ట్ చేసింది.
ప్రస్తుతం సౌత్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న వాళ్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాతి కాలంలో హీరోయిన్ గా వెండితెరపై ప్రత్యక్షమైంది. 2012లో తమిళంలో వచ్చిన మూగమూడి (తెలుగులో మాస్క్) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ తన అందంతో ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ కెరీర్లో చెత్త సినిమా ఏదో చెప్పింది. ఆ సినిమాలో హీరోతో రొమ్యాన్స్ చేయడం వల్ల తన కెరీర్లో సంవత్సరం వేస్ట్ అయిందని వాపోయింది.
తన కెరీర్ లో మొహెంజో దారో
పెద్ద పనికిమాలిన సినిమా అంటూ పూజా హెగ్డే ఓపెన్ గా చెప్పేసింది. హృతిక్ రోషన్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించాడు. హిందీలో పూజా హెగ్డే చేసిన తొలి సినిమా ఇది. యు టీవీ మోషన్ పిక్చర్స్, అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై నిర్మితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. అయితే మొహెంజో దారో తన కెరీర్ లో అత్యంత చెత్త సినిమా అని.. ఈ మూవీ కారణంగా తనకు ఏడాది పాటు అవకాశాలు రాలేదని ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే స్వయంగా వెల్లడించింది. అయితే ఒక స్టార్ హీరో మూవీ గురించి పూజా హెగ్డే అలాంటి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది.