Pooja Hegde : ప్రకృతి ఒడిలో బుట్టబొమ్మ.. భలే అందంగా ఉన్నావమ్మా

- Advertisement -

Pooja Hegde సోషల్ మీడియాలో మరోసారి తన అందమైన ఫొటోలతో అభిమానులను అలరించింది. ఈ బ్యూటీ లేటెస్ట్​గా ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఇందులో పూజ బ్లూ కలర్ చుడీదార్​లో సందడి చేసింది. నుదుట బొట్టు పెట్టుకుని.. తల్లో మల్లెపూలతో.. చెవికి ఝుంకాళతో అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. ప్రకృతి ఒడిలో జాలీగా గడుపుతూ కెమెరాకు పోజులిచ్చింది పూజ. చేతిలో ఓవైపు పూలు.. మరోవైపు కాయలు పట్టుకుని క్యూట్ క్యూట్​గా కనిపించింది. ప్రస్తుతం పూజ ట్రెడిషనల్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Pooja Hegde
Pooja Hegde

పూజ ఇటీవలే కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో పూజ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నెగిటివ్ టాక్​తో నష్టాలు మూటగట్టుకున్నా.. రోజులు గడుస్తున్న కొద్ది కలెక్షన్లు మాత్రం మూటగట్టుకుంటోంది. ప్రస్తుతం విమర్శకుల పరంగా ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా.. కలెక్షన్లలో మాత్రం పెట్టుబడి రికవర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Pooja

పూజ ఈ సినిమా ప్రమోషన్స్​లో ఎక్కువగా ట్రెండీ ఔట్​ఫిట్లలోనే కనిపించింది. కానీ తాజాగా ట్రెడిషనల్ లుక్​లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. ఈ లుక్​లో బుట్టబొమ్మ చాలా ఫ్రెష్​గా కనిపిస్తోంది. పూజ న్యూ లుక్ చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో పూజ చాలా అందంగా కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారు. హార్ట్ ఎమోజీస్​ను షేర్ చేస్తూ ఈ బుట్టబొమ్మపై తమకు ఉన్న ప్రేమను కురిపిస్తున్నారు.

- Advertisement -
Hegde

పూజా హెగ్డే వరుసగా ఆరు ఫ్లాపులను మూటగట్టుకుంది. అయినా ఈ అమ్మడుకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా బుట్టబొమ్మకు తెగ ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం పూజ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు సరసన ఓ సినిమాలో నటిస్తోంది. త్రివిక్రమ్-పూజ కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ హిట్టే. మరి ఈ సినిమాతోనైనా పూజా హెగ్డే హిట్టు కొడుతుందా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here