Pooja Hegde : అక్కినేని నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. కెరీర్ తొలినాళ్లలో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ ముద్ర వేయించుకుంది. కొన్నాళ్లకే సర్దేసుకుంటుందిలే అనుకుంటే ఊహించని విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడు అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం.. ఎన్టీఆర్ తో అరవింద సమేత.. మహేశ్ బాబుతో మహర్షి, అలా వైకుంఠపురం ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది పూజా హెగ్డే. అక్కడ స్టార్ హీరోల సరసన నటించినా.. పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

ప్రస్తుతం తాను తెలుగులో మహేశ్ తో గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది అంటూ వార్తలు వచ్చినా కొన్ని కారణాల చేత తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే కి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. ముంబైకి చెందిన ఒక ప్రముఖ క్రికెటర్ ను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె అభిమానులు మాత్రం తమ అభిమాన తార ఇష్టపడిన ఆ క్రికెటర్ ఎవరా.. అంటూ తెగ ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై పూజా హెగ్డే స్పందించలేదు. ఇటీవలే ముంబైలో సేవ మండల్ సందర్శించిన ఆమె అక్కడ గణేశుడిని దర్శించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సాంప్రదాయమైన దుస్తులలో వెళ్లిన పూజా హెగ్డే ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.