పూజా హెగ్డే వద్ద ఉన్న ఐదు ఖరీదైన వస్తువులు ఏమిటో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంగుళూరు కు చెందిన ఈ ముద్దుగుమ్మ పుట్టి పెరిగింది ముంబైలో. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన పూజా 2010లో జరిగిన మిస్ ఇండియా కాంపిటీషన్లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తరువాత తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమై ఓ లైలా కోసం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

పూజా హెగ్డే
పూజా హెగ్డే

కెరీర్ ఆరంభం దశలో వరుస ప్లాపులతో ఐరన్ లెగ్ అని కూడా అనిపించుకున్న పూజా క్రమంగా తన సక్సెస్ స్టోరీ ని సొంతంగా రాసుకుంది. పూజా సినీ కెరీర్ కి ఫస్ట్ బ్రేక్ బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథం మూవీ తో వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె కెరియర్ మంచి సక్సెస్ మూవీస్ తో బాగా బిజీ అయిపోయింది. సాలిడ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది.

మళ్లీ అనూహ్యంగా గత ఏడాది నుంచి తిరిగి పూజా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటుంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు ఫ్లాపులు పూజా ఖాతాలో రికార్డు అయ్యాయి. అది చాలదు అన్నట్టు మరోపక్క శ్రీ లీల, మృణాల ఠాకూర్ లాంటి హీరోయిన్లు గట్టి పోటీని ఇస్తున్నారు. కొన్ని కారణాలవల్ల చేతికి వచ్చిన గుంటూరు కారం,ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు చేయి జారిపోయాయి. మళ్లీ తిరిగి కెరియర్ మొదట్లో లాగా ప్రస్తుతం మంచి ఆఫర్ల కోసం పూజా ఎదురుచూస్తోంది.

- Advertisement -

ఈ విషయం పక్కన పెడితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఈ గుమ్మ బాగానే సంపాదించింది. ప్రస్తుతం ఆమె దగ్గర ఉన్న ఆస్తుల విలువ సుమారు 66 కోట్లు. పూజా వద్ద ఉన్న అత్యంత ఐదు ఖరీదైన వస్తువులు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. అవి ఏమిటో తెలుసుకుందాం. ముంబై బాంద్రా సముద్ర తీరానికి ఎదురుగా పూజా హెగ్డే కి 8 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో అక్కడే ఉంటుంది.

హైదరాబాదులో ఐదు కోట్లు విలువచేసే మరొక అపార్ట్మెంట్ పూజా పేరిట ఉంది. పూజా దగ్గర ఉన్న పోర్షే కయెన్ కారు విలువ అక్షరాల రెండు కోట్లు. ఇది కాక మరొక 1.08 కోట్ల విలువైన జాగ్వార్ , 85 లక్షలు విలువచేసే ఆడి Q7 కార్స్ పూజా వద్ద ఉన్నాయి.ఇవి కాక 1.4 లక్షలు విలువ చేసే లూయిస్ విట్టన్ క్రోయిసెట్ హ్యాండ్‌బ్యాగ్,1.91 లక్షల విలువ గల లూయిస్ విట్టన్ వైట్ హ్యాండ్‌బ్యాగ్ పూజా సొంతం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here