Pooja Hegde : గోపికమ్మా చాలును లేమ్మా ఈ నిదురా.. అంటూ గోపిక వేశంతో అందర్నీ ఆశ్చర్య పరిచి బుట్టబొమ్మా.. బుట్టబొమ్మ డ్యాన్స్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన పూజా హెగ్డే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్క్ అనే తమిళ సినిమాతో 2012లో సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ… ఒక లైలా కోసం చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో ప్లాపులు పడ్డ ఆ తర్వాత బ్రేకుల్లేని హిట్స్ తో కెరీర్ పరంగా యమా జోరు చూపించింది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. దాంతో సౌత్ తో పాటు నార్త్ నుంచే సైతం ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి. ఇక కెరీర పిక్స్ లోకి వెళ్తుంది అనుకుంటున్న తరుణంలో వరుస ప్లాపులు పూజా హెగ్డే తలుపు తట్టాయి.
టాలీవుడ్ లోనే బాలీవుడ్లోనూ ఈ అమ్మడికి కలిసి రావడం లేదు పాపం. సల్మాన్ ఖాన్ తో కలిసి చేసిన సినిమా కూడా ఉసూరనిపించింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో మహేష్ బాబు(Mahesh Babu) కు జోడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎమ్‌బీ 28
లో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా ఎంపికైంది. తెలుగులో ఈ ప్రాజెక్ట్ మినహా మరో సినిమా పూజా హెగ్డే చేతిలో లేదు. అటు నార్త్ లోనూ ఆఫర్లు అంతంత మాత్రమే ఉన్నాయి. అయితే ఫ్లాపులు పడిన పూజా హెగ్డే కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అపజయాలు ఎదురైనా పూజా హెగ్డే ఏమాత్రం జంకడం లేదు. దీంతో పూజా తన ఆశలన్నీ త్రివిక్రమ్ మీదే పెట్టుకుంది. నెటిజన్లు కూడా పూజాకు ఆయనే దిక్కు అని కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు రెమ్యునేషన్ కూడా తగ్గించేయాలని పలువురు నిర్మాతలు అడుగుతున్నారు. రెమ్యునరేషన్(remuneration) తగ్గించుకునేందుకు ఒప్పుకుంటేనే ఆఫర్లు ఇస్తామని అంటున్నారట. ప్రస్తుతం పూజి హెగ్డే ఒక్కో సినిమాకు రూ. 3 నుంచి 4 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ప్లాపులు పడ్డా రెమ్యునరేషన్ విషయంలో పూజా హెగ్డే ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ తగ్గించుకుంటేనే ఆఫర్లు ఇస్తామని అంటున్నారట. మరి ఈ విషయంలో పూజా హెగ్డే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.