Ponniyin Selvan 2 Collections : భారీ తారాగణం మరియు భారీ బడ్జెట్ తో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ -1 ‘ గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పొన్నియన్ సెల్వన్ – 2 ‘ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదలైంది.

అయితే మొదటి భాగం కి ఉన్న క్రేజ్ మరియు హైప్ రెండవ భాగానికి విడుదలకు ముందు లేదు, అందుకే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ యావరేజి గా జరిగాయి, కానీ విడుదల తర్వాత మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం తో ప్రతీ షో కి ఆక్యుపెన్సీలు పెరుగుతూ పోయాయి.షాకింగ్ విషయం ఏమిటంటే తెలుగు లో ఈ చిత్రం చాలా ప్రాంతాలలో అఖిల్ ‘ఏజెంట్’ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.

ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది, మార్నింగ్ షోస్ లో ఏజెంట్ ఆధిపత్యం చూపించినప్పటికీ, మ్యాట్నీ నుండి హైదరాబాద్ లాంటి సిటీలలో ‘పొన్నియన్ సెల్వన్ -2 ‘ ఆక్యుపెన్సీలు ‘ఏజెంట్’ కంటే ఎక్కువ ఉన్నాయి.ఈ చిత్రానికి కేవలం తెలుగు వెర్షన్ నుండే మొదటి రోజు మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.ఇది డీసెంట్ స్థాయి ఓపెనింగ్ అని చెప్పొచ్చు, ఇక తమిళం లో ఊహించినట్టుగానే ఈ చిత్రం ఓపెనింగ్స్ విషయం లో దుమ్ములేపేసింది.

మిగిలిన బాషలలో కూడా మంచి ఓపెనింగ్ దక్కింది కానీ, మొదటి భాగం తో పోలిస్తే తక్కువే అని చెప్పొచ్చు. మొదటి భాగానికి అన్నీ భాషలకు కలిపి 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, కానీ రెండవ భాగానికి 60 కోట్ల రూపాయిల లోపే గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. కానీ లాంగ్ రన్ విషయం లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కి పార్ట్ 1 కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది.